FIFA World Cup: ఫిఫా వరల్డ్ కప్.. రెయిన్‌బో టీషర్ట్ ధరించినందుకు జర్నలిస్టుకు స్టేడియంలోకి నో ఎంట్రీ

ఫిఫా వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇస్తున్న ఖతార్ అనేక వివాదాలకు కారణమవుతోంది. తాజాగా రెయిన్ బో ఉన్న టీ షర్ట్ ధరించినందుకు ఒక అమెరికన్ జర్నలిస్టును స్టేడియంలోకి అనుమతించలేదు.

FIFA World Cup: ఫిఫా వరల్డ్ కప్.. రెయిన్‌బో టీషర్ట్ ధరించినందుకు జర్నలిస్టుకు స్టేడియంలోకి నో ఎంట్రీ

FIFA World Cup: ఫిపా వరల్డ్ కప్‌ నిర్వహిస్తున్న ఖతార్ వైఖరి అనేక విమర్శలు, వివాదాలకు తావిస్తోంది. ఇప్పటికే బీర్ల నిషేధం, స్లీవ్ లెస్ తరహా దుస్తులపై నిషేధం, మత బోధన కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాలతో విమర్శలు ఎదుర్కొంటున్న ఖతార్.. తాజాగా మరో వివాదానికి తెరలేపింది.

Sabarimala Pilgrims: శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. విమానంలో ఇరుముడి తీసుకెళ్లేందుకు అనుమతి

రెయిన్ బో ఉన్న టీ షర్ట్ ధరించినందుకు అమెరికాకు చెందిన ఒక జర్నలిస్టును మ్యాచ్ జరుగుతున్న స్టేడియంలోకి అనుమతించలేదు. దీనిపై ఆ జర్నలిస్టు ట్విట్టర్ వేదికగా స్పందించాడు. తనను రెయిన్ బో టీ షర్ట్ ధరించినందుకు స్టేడియంలోకి అనుమతించలేదని, షర్ట్ మార్చుకుని వస్తేనే పంపిస్తామని నిర్వాహకులు చెప్పారని ఆ జర్నలిస్టు ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. దీంతో ఈ అంశం నిమిషాల వ్యవధిలోనే ట్రెండ్ అయింది. చాలా మంది నిర్వాహకుల తీరును విమర్శించారు. ఖతార్ ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా అసహనం వెలిబుచ్చారు. అయితే, దీనిపై ఖతార్‌కు చెందిన ఒక స్కాలర్ స్పందించాడు. ఖతార్ స్కాలర్ నయేహ్ బిన్ నహర్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. రెయిన్ బో టీ షర్ట్ ధరించిన కారణంగా అతడిని స్టేడియంలోకి అనుమతించనందుకు ఒక ఖతార్ పౌరుడిగా గర్వంగా ఉందన్నాడు.

Rahul Gandhi: రాహుల్ యాత్రలో సినీ తారలు.. డబ్బులిచ్చి రప్పిస్తున్నారంటూ బీజేపీ విమర్శ

‘‘అతడిని అనుమతించకపోవడంలో ఏం జరిగిందో ఆ విషయంలో ఖతార్ పౌరుడిగా గర్వంగా ఉంది. తమ విలువలు ప్రపంచమంతా అంగీకరించవనే విషయాన్ని పాశ్చాత్య దేశాలు ఎప్పుడు గుర్తిస్తాయో? ఇతర విలువలతో కూడిన సంస్కృతి కూడా ఉంటుందనే విషయాన్ని గుర్తించాలి. వాటిని కూడా గౌరవించాలి. పశ్చిమ దేశాలేమీ మానవత్వం గురించి మాట్లాడే ప్రతినిధులేం కావు’’ అని అతడు తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. రెయిన్ బో కలర్‌ను ఎల్జీబీటీక్యూకు సంకేతంగా భావిస్తారనే సంగతి తెలిసిందే. ఖతార్ వంటి ఇస్లాం దేశాలు వీటిని అంగీకరించవు.