ప్రధాని మోడీకి మరో ప్రతిష్టాత్మక అవార్డు

  • Publish Date - April 12, 2019 / 03:41 PM IST

ప్రధానమంత్రి నరేంద్రమోడీకి మరో ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది. ‘ఆర్డర్‌ ఆఫ్‌ సెయింట్‌ ఆండ్రూ ది అపోస్టల్‌’ అవార్డును ఈ ఏడాది మోడీకి ఇవ్వనున్నట్లు రష్యా రాయబార కార్యాలయం తెలిపింది. ఇది రష్యా దేశ అత్యున్నత పురస్కారం. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంలో అసాధారణ సేవలు అందించినందుకు గానూ ఈ అవార్డును అందిస్తున్నట్లు రష్యా ఎంబసీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రధాని మోడీ ఇప్పటికే అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నారు. గతేడాది దక్షిణకొరియా సియోల్‌ శాంతి బహుమతితో మోడీని సత్కరించగా.. ఇటీవల యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఇచ్చే ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం జాయెద్‌ మెడల్‌కు ప్రధాని ఎంపికయ్యారు.