Ancient Wine Factory:తవ్వకాల్లో బయటపడ్డ 1500 ఏళ్ల నాటి మద్యం ఫ్యాక్టరీ..పరిశోధనలో విస్తుగొలిపే విషయాలు..

ఇజ్రాయిల్ లో జరిపిన తవ్వకాల్లో 1500 ఏళ్ల నాటి మద్యం తయారీ ఫ్యాక్టరీని పరిశోధకులు కనుగొన్నారు.

Ancient Wine Factory : భూమి పొరల్లో నిక్షిప్తమైపోయిన ఎన్నో చరిత్రలను పురావస్తు పరిశోధకలు వెలికి తీస్తుంటారు. అలా తవ్వకాల్లో బయటపడిన వస్తువులు అలనాటి వైభవాన్ని మన కళ్లకు కడుతుంటాయి. అటువంటిదే మరో అద్భుతమైన చరిత్రను వెలికి తీశారు పరిశోధకులు. ఇజ్రాయెల్‌లో జరిపిన తవ్వకాల్లో గ్రీకు చక్రవర్తి బైజాంటైన్‌ కాలం నాటి మద్యం తయారీ కేంద్రాన్ని కనుగొన్నారు పరిశోధకులు. టెల్‌ అవీవ్‌కు దక్షిణం వైపునున్న యావ్నే పట్టణం సమీపంలో ఈ మద్యం ఫ్యాక్టరీని గుర్తించారు. గత రెండేళ్లుగా జరుపుతున్న తవ్వకాల్లో ఇటీవలే ఓ కొలిక్కివచ్చాయి. సోమవారం (అక్టోబర్ 11,2021) ఈ మద్యం కేంద్రానికి సంబంధించి వివరాలను పరిశోధకులు వెల్లడించారు.

సుమారు 1500 ఏళ్ల క్రితం ఇక్కడ భారీస్థాయిలో మద్యం తయారీ జరిగినట్టు పరిశోధకులు తేల్చారు. మొత్తం ఐదు మద్యం తయారీ యూనిట్లు, గిడ్డంగులు, మట్టి పాత్రలు నిల్వ ఉంచే బట్టీలు, వేల సంఖ్యలో జాడీలు, వాటి శకలాలను వెలికితీశారు. వీటన్నింటి ఆధారంగా యావ్నేలో ఏటా 5.2 లక్షల గాలన్లకు పైగా మద్యం తయారయ్యేదని అంచనా వేశారు.ఇజ్రాయేల్‌లో జరిపిన తవ్వకాల్లో బయటపడిన ఈ మద్యం కేంద్రం.. ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద మద్యం తయారీ కేంద్రంగా ఉండేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ‘యావ్నే 1,500 ఏళ్ల కిందట ప్రపంచ మద్యం ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా భాసిల్లింది.. బైజాంటైన్ కాలంలో అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా గుర్తింపు తెచ్చుకుంది’ అని ఇజ్రాయేల్ పురావస్తు శాఖ ప్రకటించింది.

Read more : Bactrian Treasure : తాలిబన్ల చెరలో బంగారు గనులు.. ఆ బ్యాక్ట్రియన్‌ ఖజానాను ఏం చేస్తారో?

ఈ తవ్వకాలకు నేతృత్వం వహించిన ఎలై హడాడ్, లియాత్ నాడవ్ జివ్, జోన్ సెలిగ్మన్ అనే పరిశోధకులు మాట్లాడుతు..అందంగా అలంకరించిన శంఖం ఆకారంలో ఉన్న ఈ మద్యం కేంద్రం.. ఆనాటి యజమానుల సంపదను సూచిస్తోందని తెలిపారు. ఈ వైన్‌ పరిశ్రమ సామర్ధ్యం సంవత్సరానికి 2 మిలియన్ లీటర్ల ఉత్పత్తి చేసినట్టు మా పరిశోధనల్లో తేలిందని..అయితే మొత్తం ప్రక్రియ ఎటువంటి మెషీనరీ లేకుండానే కేవలం మనుషులతోనే నిర్వహించారనే విషయం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం అని స్పష్టంచేశారు.

Read more : Jogulamba: తవ్వకాల్లో బయటపడ్డ లాకర్.. తెరిచిచూస్తే షాక్

బైజాంటైన్ కాలంలో మద్యం సేవించడం సాధారణంగా ఉండేది. దీనికి కారణం తాగునీటి సమస్య ఉండటం కూడా కారణం మరో ముఖ్యమైన విషయం. స్వచ్ఛమైన తాగునీరు సమస్య వల్ల వైన్ ఎక్కువగా తాగేవారట. ఈ ప్రాంతంలోని నీటిని రుచిగా మార్చడానికి కూడా వైన్‌ను ఉపయోగించేవారని పరిశోధకులు భావిస్తున్నారు. ద్రాక్ష పండ్లను కాళ్లతో తొక్కి రసం తీసి.. దానిని బట్టీల్లో మట్టి పాత్రల్లోకి పంపి మద్యం తయారు చేసేవారని ఆ మద్యం చాలా రుచిగా ఉండటం వల్ల దాన్నే ఎక్కువగా తాగేవారని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. కానీ ఈ మద్యం తయారీ కేంద్రంపైనా ఆనాటి ప్రజల జీవన విధానంపైనా పరిధనలు కొనసాగిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు