Asia Games
Asian Games 2022: ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్‌లో చైనాలోని హాంగ్‌జౌలో జరగాల్సిన ఆసియా క్రీడలు-2022 కొవిడ్-19 ఉధృతి కారణంగా వాయిదా పడిన విషయం విధితమే. తాజాగా క్రీడలను నిర్వహించేందుకు OCA (Olympic Council of Asia) నిర్ణయించింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ లో మార్పులు చేసి తేదీలను ప్రకటించింది. వచ్చే ఏడాది 23సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ఈ క్రీడలను నిర్వహించనున్నట్లు మంగళవారం OCA ప్రతినిధులు ప్రకటించారు.
Asian Games 2022 : కరోనా సంక్షోభం.. ఆసియా క్రీడలు ఇప్పట్లో లేనట్టే..?
అథ్లెట్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 19వ ఆసియా ఒలింపిక్ క్రీడలను 2022సంవత్సరంలో చైనా నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం సెప్టెంబర్ 10 నుంచి 25 మధ్య క్రీడల నిర్వహణకు ప్లాన్ చేసింది. హాంగ్‌జౌలో మైదానాలను సిద్ధం చేసింది. అయితే ఊహించని రీతిలో చైనాలో కొవిడ్ వ్యాప్తి విజృంభించింది. ఇటీవల రెండు నెలల పాటు ఆ దేశంలోని అన్ని ప్రాంతాల్లో కొవిడ్ వ్యాప్తి తీవ్రం కావడంతో అక్కడి ప్రభుత్వ లాక్ డౌన్ విధించింది. కఠిన ఆంక్షలను అమలు చేసింది. ఈ క్రమంలో ఈ ఏడాది సెప్టెంబర్ లో జరగాల్సిన క్రీడలను వాయిదా వేస్తున్నట్లు ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ ప్రకటించింది. కొవిడ్ ఉధృతి తగ్గిన తరువాత క్రీడల తేదీలను ప్రకటిస్తామని తెలిపింది.
Folks, pick up your planners… The new dates for the 19th Asian Games have finally been announced! ??
The highly-anticipated event will now be held in Hangzhou from 23rd September to 8th October in 2023.#AsianGames #AG2022 #Announcement #Hangzhou @19thAGofficial pic.twitter.com/MpbZFqK058— Olympic Council of Asia (@AsianGamesOCA) July 19, 2022
ప్రస్తుతం చైనాలో కొవిడ్ ఉధృతి తగ్గుముఖం పట్టడంతో ఆసియా క్రీడలు-2022ను నిర్వహించేందుకు 6మే 2022న OCA ఎగ్జిక్యూటివ్ బోర్డ్ (EB) టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది గత రెండు నెలలుగా టాస్క్ ఫోర్స్ చైనా ఒలింపిక్ కమిటీ, హాంగ్‌జౌ ఆసియన్ గేమ్స్ ఆర్గనైజింగ్ కమిటీ (HAGOC), ఇతర ప్రధాన అంతర్జాతీయ క్రీడా ఈవెంట్‌లతో చర్చించి క్రీడల తేదీలను OCAకు తెలిపింది. మంగళావారం ఓసీఏ ఎగ్జిక్యూటివ్ బోర్డు వచ్చే ఏడాది సెప్టెంబర్23 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ఆసియా క్రీడలు -2022ను నిర్వహించేందుకు సిద్ధమైంది. అయితే క్రీడలు జరిగే స్టేడియంలలో ఎలాంటి మార్పు చేయలేదు.