Pak Army Chief: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‭గా బాధ్యతలు స్వీకరించిన ఆసిం మునీర్

మునీర్ ఇంతకుముందు ఫ్రాంటియర్ ఫోర్స్ రెజిమెంట్‌లో పనిచేశారు. 2017 ప్రారంభంలో మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమితులయ్యారు. 2018 అక్టోబర్‌లో ఐఎస్ఐ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత అప్పటి ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ 8 నెలల్లోనే ఆయన్ను ఐఎస్ఐ చీఫ్ పదవి నుంచి తప్పించారు. తనకు అత్యంత సన్నిహితుడైన లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్‌ను చీఫ్‌గా నియమించారు

Pak Army Chief: పాకిస్తాన్ నూతన ఆర్మీ చీఫ్‭గా నియామకమైన ఆసిం మునీర్.. మంగళవారం (నవంబర్ 29) అధికారికంగా పదవీ బాద్యతలు చేపట్టారు. పాక్ రాజధాని ఇస్లామాబాద్‭లో ఉన్న జనరల్ హెడ్‌క్వార్టర్స్‌లో వేడుకగా జరిగిన కార్యక్రమంలో పాక్ 17వ ఆర్మీ చీఫ్‌గా మునీర్ ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా రెండు సార్లు ఆర్మీ చీఫ్‌గా కొనసాగిన జావెద్ బజ్వా నేటితో రిటైర్ కావడంతో ఆయన స్థానంలో మునీర్ బాధ్యతలు స్వీకరించారు.

జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్‌గా లెఫ్టినెంట్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జాను, రాజ్యాంగ అధికారాన్ని ఉపయోగించి లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్‌ను ఆర్మీ స్టాఫ్ చీఫ్‌గా ఈ నెల 24న పాకిస్తాన్ ప్రధాన మంత్రి షేహబాజ్ షరీఫ్ నియమించారు. పాకిస్థాన్‌లో ప్రధాని, అధ్యక్షుడి కంటే ఆర్మీ చీఫ్‌ పదవే అత్యంత కీలకం. చాలా కాలంగా స్థానిక, విదేశీ కార్యకలాపాల్లో ఆర్మీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. అందుకే ఈ పదవికి అంతటి ప్రాధాన్యం ఉంటుంది.

Khadgam : 20 ఏళ్ళ ఖడ్గం.. చంపేస్తామని దర్శకుడికి బెదిరింపులు.. భయంతో జేబులో గన్ పెట్టుకొని తిరిగిన హీరో..

మునీర్ ఇంతకుముందు ఫ్రాంటియర్ ఫోర్స్ రెజిమెంట్‌లో పనిచేశారు. 2017 ప్రారంభంలో మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమితులయ్యారు. 2018 అక్టోబర్‌లో ఐఎస్ఐ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత అప్పటి ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ 8 నెలల్లోనే ఆయన్ను ఐఎస్ఐ చీఫ్ పదవి నుంచి తప్పించారు. తనకు అత్యంత సన్నిహితుడైన లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్‌ను చీఫ్‌గా నియమించారు. కాగా, ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ పలు పేర్లు పరిశీలించి మునీర్‌కు ఆర్మీ చీఫ్ బాధ్యతల్ని అప్పగించారు.

వాస్తవానికి బజ్వా పదవీ కాలం గతంలోనే ముగిసింది. అయితే ఆయన పదవీ కాలం పలుమార్లు పొడగించారు. అలా మూడు సంవత్సరాల పాటు పొడిగించారు. అయితే నిబంధనల ప్రకారం.. పొడగింపుకు ఆయనకు మరో అవకాశం లేదు. ఇక లెప్ట్‌నెంట్ జనరల్‌గా ఉన్న మునీర్ నాలుగేళ్ల పదవీకాలం కూడా ఈనెల 27తోనే ముగియాల్సి ఉంది. అయితే ఆయన రిటైర్మెంట్‌కు ముందే ఆర్మీ చీఫ్‌గా ఆయన పేరు ప్రకటించడంతో మరో మూడేళ్ల పాటు ఆయన పదవీకాలం పొడిగించినట్టయింది.

Indian Soldiers: సినిమా స్టంట్స్ కాదు.. రియల్ స్టంట్స్.. భారత సైనికుల అద్భుత ప్రతిభకు నిదర్శనం ఈ వీడియోలు

ట్రెండింగ్ వార్తలు