Khadgam : 20 ఏళ్ళ ఖడ్గం.. చంపేస్తామని దర్శకుడికి బెదిరింపులు.. భయంతో జేబులో గన్ పెట్టుకొని తిరిగిన హీరో..

స్వాతంత్ర దినోత్సవం అయినా, గణతంత్ర దినోత్సవం అయినా రెండు తెలుగు రాష్ట్రాల టెలివిజన్ లో తప్పకుండా ప్రసారమయ్యే సినిమా 'ఖడ్గం'. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పటిలో ఒక సంచలనం. 2002 నవంబర్ 29న విడుదలైన ఈ సినిమాలో శ్రీకాంత్ - పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా, రవితేజ - సినిమా హీరోగా, ప్రకాష్ రాజ్ - ముస్లిం పాత్రల్లో నటించారు. నేటితో ఈ సినిమా 20 ఏళ్ళ పూర్తి చేసుకుంది.

Khadgam : 20 ఏళ్ళ ఖడ్గం.. చంపేస్తామని దర్శకుడికి బెదిరింపులు.. భయంతో జేబులో గన్ పెట్టుకొని తిరిగిన హీరో..

20 years for Khadgam

Khadgam : స్వాతంత్ర దినోత్సవం అయినా, గణతంత్ర దినోత్సవం అయినా రెండు తెలుగు రాష్ట్రాల టెలివిజన్ లో తప్పకుండా ప్రసారమయ్యే సినిమా ‘ఖడ్గం’. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పటిలో ఒక సంచలనం. 2002 నవంబర్ 29న విడుదలైన ఈ సినిమాలో శ్రీకాంత్ – పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా, రవితేజ – సినిమా హీరోగా, ప్రకాష్ రాజ్ – ముస్లిం పాత్రల్లో నటించారు. నేటితో ఈ సినిమా 20 ఏళ్ళ పూర్తి చేసుకుంది.

Kamal Haasan : “పుష్పక విమానం”కి 35 ఏళ్ళు.. కమల్ హాసన్ ట్వీట్!

అలాగే పల్లెటూరి నుంచి హీరోయిన్ అవుదాము అని వచ్చిన అమ్మాయి పాత్రలో సంగీత నటించింది. ఒక పక్క దేశభక్తి చూపిస్తూనే, మరోపక్క సినీ రంగంలో ఆర్టిస్ట్ లు ఎదురుకునే వాస్తవ సంఘటనలను దర్శకుడు కృష్ణవంశీ చాలా చక్కగా చూపించాడు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు ఆరో ప్రాణం అనే చెప్పాలి. ముఖ్యంగా ‘మేమే ఇండియన్స్’ అని సాగే పాట భారతీయులు వ్యక్తిత్వాన్ని ప్రతిభింబించేలా ఉంటుంది.

కాగా ఈ సినిమా రిలీజ్ సమయంలో ఎన్నో గొడవలు జరిగాయి. అసలు సినిమాలో ఏముంది, దర్శకుడు ఏమి చూపించాడు అనేది ఆలోచించకుండా.. ఒక మతాన్ని తప్పుగా చూపించారు అంటూ థియేటర్ లను ధ్వంసం చేశారు తిరుగుబాటుదారులు. ఇక దర్శకుడి కృష్ణవంశీ అయితే చంపేస్తామనే బహిరంగ బెదిరింపులు ఎదురుకొని, దాదాపు వారం రోజులపాటు అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయాడు. హీరోగా నటించిన శ్రీకాంత్ అయితే భయంతో జేబులో గన్ పెట్టుకొని తిరిగినట్లు వెల్లడించాడు. ఇన్ని గొడవలు జరిగిన ఈ సినిమా 100 రోజులు ప్రదర్శింపబడి రికార్డు సృష్టించింది.