Indian Soldiers: సినిమా స్టంట్స్ కాదు.. రియల్ స్టంట్స్.. భారత సైనికుల అద్భుత ప్రతిభకు నిదర్శనం ఈ వీడియోలు

భారత సైనికుల ప్రతిభాపాటవాల్ని చూడాలని ఉందా? అయితే ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసిన మన సైనికుల వీడియోల్ని ఒకసారి చూడండి. ఈ వీడియోలు చూస్తే వాళ్లను రియల్ హీరోలు అనకమానరు.

Indian Soldiers: సినిమా స్టంట్స్ కాదు.. రియల్ స్టంట్స్.. భారత సైనికుల అద్భుత ప్రతిభకు నిదర్శనం ఈ వీడియోలు

Indian Soldiers: భారత సైనికులు అత్యంత శక్తివంతులు, ప్రతిభా వంతులు అనే సంగతి తెలిసిందే. శత్రు సైన్యాన్ని ఎదుర్కోవడంలో ముందుంటారు. ఏ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై పూర్తిగా శిక్షణ పొంది ఉంటారు. నిరంతరం సైనికులకు ఇలాంటి అనేక అంశాలపై శిక్షణ అందుతూనే ఉంటుంది.

Twitter: ట్విట్టర్ బ్లూటిక్ అకౌంట్ల రీవెరిఫికేషన్.. ఈ వారమే ప్రారంభిస్తామంటున్న ఎలన్ మస్క్

మనవాళ్లకు శిక్షణ ఎలాం ఉంటుంది? వాళ్ల ప్రతిభ ఎంతో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోలు చూడండి. మీకే అర్థమవుతాయి. శత్రువులు చుట్టు ముట్టినప్పుడు, తుపాకీతో బెదిరించినప్పుడు, తీవ్రవాదులు దాడులకు తెగబడ్డప్పుడు వాళ్లను ఎలా ఎదుర్కోవాలో శిక్షణ ఇస్తుంటారు. ఈ విషయంలో శిక్షణకు సంబంధించిన వీడియోలను ఇండియన్ ఆర్మీ విడుదల చేసింది. వివిధ సందర్భాల్లో సైన్యం వ్యవహరించే తీరును ఈ వీడియోలు కళ్లకు కడుతున్నాయి. ఈ వీడియోలు చూస్తే మన సైన్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. సినిమాల్లో హీరోలు చేసే యాక్షన్ సీన్స్, స్టంట్స్ మించి నిజంగా మన వాళ్లు చేస్తున్న సాహసాన్ని ప్రశంసించకుండా ఉండలేరు.

భారత సైన్యానికి సంబంధించి సైనిక దళాల 18వ ఉమ్మడి శిక్షణ కార్యక్రమం చైనా సరిహద్దులోని ఉత్తరాఖండ్ పరిధిలో జరుగుతోంది. అక్కడి వీడియోలే ఇవి.