విడాకుల కోసం కోర్టుకు సిరియా మాజీ అధ్యక్షుడు అసద్‌ భార్య అస్మా.. ఎందుకో తెలుసా?

అసద్‌ను ఆమె లండన్‌లో చదువుతున్న సమయంలో కలిశారు.

సిరియాలో తిరుగుబాటుదారుల ఆక్రమణలతో ఆ దేశ మాజీ అధ్యక్షుడు బషర్‌ అల్‌-అసద్‌ రష్యాకు పారిపోయిన విషయం తెలిసిందే. అసద్ భార్య అస్మా అల్-అసద్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆమె లండన్‌కు మకాం మార్చాలనుకుంటున్నారు.

విడాకుల కోసం ఆమె రష్యా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మాస్కోలో నివసించడం పట్ల ఆమె అయిష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. యూకేకి వెళ్లడానికి ఆమె అనుమతులు కోరుతున్నారు. అస్మాకు బ్రిటిష్‌తో పాటు సిరియన్ పౌరసత్వం కూడా ఉంది. ఆమె గతంలో సిరియాకు చెందిన తన తల్లిదండ్రులతో లండన్‌లో కొన్నేళ్ల పాటు ఉన్నారు.

ఆమె 2000లో సిరియాకు మకాం మార్చారు. అదే సంవత్సరం ఆమె (25 సంవత్సరాల వయస్సులో) అసద్‌ను వివాహం చేసుకున్నారు. అసద్‌ను ఆమె అంతకుముందు లండన్‌లో చదువుతున్న సమయంలో కలిశారు.

దీంతో వారిద్దరి మధ్య అప్పట్లో పరిచయం ఏర్పడింది. కాగా, అస్మా ఆరోగ్య సమస్యలతోనూ పోరాడుతున్నారు. 2019లో ఆమె రొమ్ము క్యాన్సర్‌ను జయించింది. ఆ తర్వాత ఈ ఏడాది మేలో ఆమె లుకేమియాతో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయింది.

కాగా, దేశాన్ని విడిచి పారిపోయిన అసద్ ఆ సమయంలో తమ దేశ సైనిక రహస్యాలను ఇజ్రాయెల్‌కు అందించినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి.

సిరియా నుంచి ఎలాంటి ఆటంకాలు లేకుండా బయటపడేందుకు ఆయన ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. తమ దేశంలోని ఆయుధ డిపోలతో పాటు సైనిక స్థావరాల వంటి వివరాలను ఆయన అందజేశారని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. దీంతో ఆయన అందించిన సమాచారం ఆధారంగా ఇజ్రాయెల్‌ దాడులకు పాల్పడినట్లు చెప్పింది.

USA: ట్రంప్ టీమ్‌లో మరో భారత సంతతి వ్యక్తి శ్రీరామ్ కృష్ణన్.. అతని స్వస్థలం ఎక్కడో తెలుసా!