USA: ట్రంప్ టీమ్‌లో మరో భారత సంతతి వ్యక్తి శ్రీరామ్ కృష్ణన్.. అతని స్వస్థలం ఎక్కడో తెలుసా!
భారత సంతతి వ్యక్తి శ్రీరామ్ కృష్ణన్ కు ట్రంప్ తన కార్యవర్గంలో అవకాశం కల్పించారు. శ్రీరామ్ కృష్ణన్ వ్యాపారవేత్త,

Sriram Krishnan
Sriram Krishnan: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆయన వచ్చే ఏడాది జనవరి 20న అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. ఈలోపే తన కార్యవర్గాన్ని ట్రంప్ సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ట్రంప్ టీంలో ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు అవకాశం దక్కింది. తాజాగా మరో భారత సంతతి వ్యక్తి శ్రీరామ్ కృష్ణన్ కు ట్రంప్ తన కార్యవర్గంలో అవకాశం కల్పించారు. శ్రీరామ్ కృష్ణన్ వ్యాపారవేత్త, టెకీ, రచయిత. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)కి సంబంధించి సీనియర్ పాలసీ అడ్వైజర్ గా నియమితులయ్యాడు. వైట్ హౌస్ ఏఐ క్రిప్టో జార్ డేవిడ్ ఒ శాక్స్ తో కలిసి కృష్ణన్ పనిచేస్తారు.
శ్రీరామ్ కృష్ణన్ నియామకాన్ని ప్రకటిస్తూ ట్రంప్ ట్విటర్ లో పోస్టు చేశారు. ‘‘శ్రీరామ్ కృష్ణన్ వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీనియర్ పాలసీ అడ్వైజర్ గా వ్యవహరిస్తాడు. డేవిడ్ శాక్స్ తో కలిసి పనిచేస్తూ.. ఏఐలో అమెరికన్ నాయకత్వాన్ని కొనసాగించడంపై దృష్టిసారిస్తాడు. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీపై ప్రెసిడెంట్ కౌన్సిల్ ఆఫ్ అడ్వైజర్స్‌తో సహా ప్రభుత్వం అంతటా ఏఐ విధానాన్ని రూపొందించడంలో, సమన్వయం చేయడంలో సహాయపడతారని ట్రంప్ పేర్కొన్నారు.’’
Also Read: Donald Trump : జనవరి 20ని తలుచుకుని భయపడుతున్న భారతీయులు..! ఎందుకంత భయం? అసలు కారణం ఏంటి?
శ్రీరామ్ కృష్ణన్ ఎవరు?
కృష్ణన్ తమిళనాడుకు చెందిన వ్యక్తి. తమిళనాడు రాజధాని చెన్నైలో జన్మించారు. కృష్ణన్ కు మొదటి నుంచి సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి ఉండేది. అతను అన్నా యూనివర్శిటీలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 2005లో అన్నా యూనివర్శిటీలోని ఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ పట్టా పొందారు. 2007లో మైక్రోసాప్ట్ లో ప్రోగ్రామ్ మేనేజర్ గా తన కెరీర్ ను ప్రారంభించాడు. 2013లో ఫేస్ బుక్ లో చేరారు. ట్విటర్, యాహూ, స్పాప్ వంటి సంస్థల్లోనూ పనిచేశారు. ట్విటర్ (ఎక్స్)లో పనిచేసిన కాలంలో బిలియనీర్ ఎలోన్ మస్క్ తో కృష్ణన్ కు మంచి సంబంధం ఉంది. 2022లో ఎలాన్ మస్క్ ట్విటర్ ను టేకోవర్ చేసిన తరువాత ట్విటర్ ను పునరుద్దరించడానికి మస్క్ తో కలిసి పనిచేశారు. ఆ సమయంలో సంస్థ తదుపరి సీఈఓగా కృష్ణన్ ను నియమిస్తారనే ప్రచారం కూడా జరిగింది.