Donald Trump : జనవరి 20ని తలుచుకుని భయపడుతున్న భారతీయులు..! ఎందుకంత భయం? అసలు కారణం ఏంటి?
మొదటి దఫా పాలనతో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో భారతీయులపై భారీ ఎఫెక్ట్ పడింది. దీంతో ఈసారి ఆయన ఏం చేయబోతున్నారు?

Donald Trump : మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్.. ట్రంప్ నినాదం ఇదే. ఇందుకోసం తగ్గేదేలే అన్నట్లు కనిపిస్తున్నారు. అక్రమ వలసల మీదే ట్రంప్ మెయిన్ గా టార్గెట్ పెట్టబోతున్నారు. జనవరి 20 తర్వాత ట్రంప్ ఆడించే ఆట ఏంటో ప్రపంచం చూడబోతోంది. ఇదే ఇప్పుడు లక్షల మంది భారతీయులకు టెన్షన్ కు కారణం అవుతోంది. జనవరి 20ని తలుచుకుని మరీ మనోళ్లు కంగారు పడిపోతున్నారు. ఎందుకంత భయం? టెన్షన్ కు అసలు కారణం ఏంటి?
మొదటి దఫా పాలనతో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో భారతీయులపై భారీ ఎఫెక్ట్ పడింది. దీంతో ఈసారి ఆయన ఏం చేయబోతున్నారు? అనేదే మనోళ్ల టెన్షన్. జనవరి 20ని తలుచుకుని బాధపడుతున్నది, భయపడుతున్నది అందుకే. భారతీయులకు మళ్లీ ఇబ్బందులు తప్పవా? ట్రంప్ ఆలోచనలు, నిర్ణయాలు ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి?
జనవరి 20న ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు. తన క్యాబినెట్ ను ఇప్పటికే అతివాదులు, వలసల వ్యతిరేకులతో నింపేశారు. కీలకమైన ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ మాజీ చీఫ్ టామ్ హోమన్ ను బోర్డర్ జార్ పదవికి ఎంపిక చేశారు. అక్రమ వలసదారులారా సామాన్లు ప్యాక్ చేసుకోవడం మొదలు పెట్టండి, మీ దేశాలకు తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చేసింది అంటూ ఎన్నికల ప్రచారంలో హోమన్ వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ తీరు ఎలా ఉండబోతుందో అని చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇదే లక్షలమంది భారతీయులను ఆందోళనకు గురి చేస్తోంది.
పూర్తి వివరాలు..
Also Read : భారీగా ఆయుధాలు పోగేస్తున్న దేశాలు.. ప్రపంచ వినాశనం తప్పదా?