Accumulation Of Massive Weapons : భారీగా ఆయుధాలు పోగేస్తున్న దేశాలు.. ప్రపంచ వినాశనం తప్పదా?

Accumulation Of Massive Weapons : యుద్ధం ప్రపంచాన్ని చుట్టేసింది. ఇప్పుడు ప్రపంచమంతా యుద్ధం కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు దేశాలన్నీ అలర్ట్ అయ్యాయి. భారీగా ఆయుధాలను పోగేసుకుంటున్నాయి. ఆయుధాల తయారీలో అమెరికా టాప్ లో ఉండగా, రష్యా దగ్గర కుప్పలు తెప్పలుగా ఉన్న న్యూక్లియర్ వార్ హెడ్ లు మరింత టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఆ రెండు దేశాలకు ధీటుగా ఇప్పుడు చైనా చేస్తున్న ప్రయత్నం మరింత టెన్షన్ పెడుతోంది. మరి భారత్ పరిస్థితి ఏంటి? మిగతా దేశాల్లో ఎలా ఉంది?
ఓవైపు రష్యా-యుక్రెయిన్ యుద్ధం. మరోవైపు ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు.. ఇంకోవైపు కొరియాల గిల్లికజ్జాలు.. యుద్ధం ముదరడానికి, అది ప్రపంచానికి వ్యాపించడానికి పెద్ద టైమ్ పట్టే అవకాశమే లేదు. ఇప్పుడు ప్రపంచమంతా యుద్ధంలో ఉన్నట్లే లెక్క. యుక్రెయిన్ కు అమెరికా క్షిపణి దాడుల గ్రీన్ సిగ్నల్ తో పరిస్థితి మరింత దారుణంగా మారింది. క్షిపణి దాడులకు అనుమతి ఇస్తే నాటో దేశాలు యుద్ధంలోకి దిగినట్లే అని భావిస్తామంటున్న రష్యా న్యూక్లియర్ పాలసీని కూడా సవరించింది. ఆ ఎఫెక్ట్ ప్రపంచం మీద మరింత కనిపిస్తోంది.
ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు ఎప్పుడు ఏ మలుపు తీసుకుని తమవైపు దూసుకు వస్తుందోననే టెన్షన్ తో దేశాలన్నీ అలర్ట్ అయ్యాయి. భారత్ సహా అన్ని దేశాలు ఆయుధాలను పోగేసుకుంటున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆయుధ పోటీ పెరిగింది. ఇదే ఇప్పుడు చాలా దేశాలను టెన్షన్ పెడుతోంది.
యుద్ధం ఎప్పుడు వచ్చినా సిద్ధం అనే రేంజ్ లో దేశాలన్నీ ఆయుధ సంపత్తిని పెంచుకుంటున్నాయి. దేశాలన్నీ యుద్ధం చేస్తే అది కచ్చితంగా అణు యుద్ధానికి దారితీయడం ఖాయం. న్యూక్లియర్ వార్ హెడ్ లను చైనా పెంచుకున్న వేళ.. ఇప్పుడు అవే భయాలు కనిపిస్తున్నాయి. ఇంతకీ అణ్వస్త్ర ఆయుధాల్లో ఏ దేశం బలం ఎంత? ఎవరు ఎంత ఖర్చు చేస్తున్నారు? భారత్ స్థానం ఏంటి?
Also Read : భయంతో వణికిపోతున్న చైనా..! డ్రాగన్ ను అంతలా భయపెడుతున్నది ఎవరు? ఆ భయమే భారత్‌కు దగ్గర చేస్తోందా?