Samantha : అంతరిక్షంలోకి సమంత..అరుదైన ఘనత..!

సమంత అంతరిక్షయానంతో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది.యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీకి మొట్టమొదటి యూరోపియన్‌ ఫిమేల్‌ కమాండర్‌ గా సమంత అరుదైన ఘనత దక్కించుకుంది.

Samantha Cristoforetti : ప్రస్తుతం సోషల్ మీడియాల నిండా సమంత-అక్కినేని నాగ చైతన్య విడాకుల వార్తలే. ఈక్రమంలో సమంత అంతరిక్షయానంతో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ‘హా ఏంటీ సమంతా అంతరిక్ష ప్రయాణమా?!! అంటూ తెగ షాక్ అయిపోతున్నారా?..కాస్త ఆగండీ సమంతా అంటేమనకు తెలిసిన సినిమా హీరోయిన్ అక్కినేని ఇంటి మాజీ కోడలు కాదు. ఆమె ఒక అందాల బొమ్మ. ఈమె ఇటాలియన్‌ ఆస్ట్రోనాట్‌. పూర్తి పేరు సమంత క్రిస్టోఫోరెట్టి.సమంత వార్తల వైరల్ అవుతున్న క్రమంలో ఈ అందాల బొమ్మ సమంత క్రిస్టోఫోరెట్టి ఓ అరుదైన గౌరవం అందుకుని వార్తల్లోకి ఎక్కింది.

Astronaut Samantha Cristoforetti

యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీకి మొట్టమొదటి యూరోపియన్‌ ఫిమేల్‌ కమాండర్‌ గా సమంతా క్రిస్టోఫోరెట్టి అరుదైన ఘనత దక్కించుకుంది. అచ్చం ఆమెలాంటి బొమ్మతో పిల్లల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా..వ్యోమగామి సమంత క్రిస్టోఫోరెట్టి లుక్‌లైక్ డాల్ జర్మనీలోని ESA బేస్ నుండి జీరో-గ్రావిటీ ఫ్లైట్‌లో ప్రయాణించి, తేలుతూ, అంతరిక్షానికి వెళ్లే ముందు వ్యోమగామి చేయవలసిన ప్రయోగానికి సిద్దమైంది.ప్రపంచ అంతరిక్ష వారోత్సవంలో భాగంగా మహిళా సాధికారికత దిశగా అడుగులు వేస్తోంది యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ. దీంట్లో భాగంగా అమ్మాయిలకు స్పేస్‌ స్టడీస్‌తోపాటు సైన్స్‌ టెక్నాలజీ మ్యాథ్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌(STEM) రంగాల్లో కెరీర్‌ పట్ల ఇంట్రెస్ట్ కలిగించటానికి ఈ కొత్త ప్రయోగానికి సిద్ధమైంది. ఇందుకోసం ఐఎస్‌ఎస్‌కు కమాండర్‌గా వెళ్లటానికి సమంత డాల్ ను ఉపయోగించబోతున్నారు.

Read more : Dry Immersion Study: అంతరిక్షంలో మహిళల శరీరం తట్టుకోగలదా? వాటర్ బెడ్‌తో ప్రయోగం!

44 ఏళ్ల సమంత క్రిస్టోఫోరెట్టి రూపంతో ఉన్న బొమ్మ(బార్బీ డాల్‌) ఒకదానిని తయారుచేయించి..అంతరిక్ష ప్రయోగాల్ని, పరిశోధనల అనుభూతుల్ని పిల్లలకు తెలియజేసే ప్రయోగం చేస్తున్నారు. దీనికోసం జర్మనీకి చెందిన ఓ జీరో గ్రావిటీ ఫ్లైట్‌ను వినియోగించారు. స్పేస్‌లోకి వెళ్లే ముందు ఏం చేయాలి? అక్కడి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? వాటిని ఎలా ఎదుర్కోవాలి? వంటి పలు అంశాలపై జీరో గ్రావిటీలో సమంత బొమ్మ ద్వారా తెలియజేస్తారు.

కాగా..ఇటలీకి చెందిన సమంత క్రిస్టోఫోరెట్టి ఆమె 1977 ఏప్రిల్ 26న జన్మించారు. ఆమె యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వ్యోమగామి.మాజీ ఇటాలియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ మరియు ఇంజనీర్. ఆమె ఒక యూరోపియన్ వ్యోమగామిగా 199 రోజులు, 16 గంటలు అంతరిక్షయానం చేసి రికార్డు నెలకొల్పారు. అంతకాలం అంతరిక్షంలో ఉన్న మొదటి ఇటాలియన్ మహిళ కూడా ఆమే కావటం విశేషం.

Read more : Eye Treatment With IPhone : ‘ఐ’ ఫోన్‌13తో ‘ఐ’ ట్రీట్మెంట్‌ చేస్తున్న డాక్టర్..

కాగా..చాలా దేశాలకు చెందిన మహిళలు అంతరిక్ష పరిశోధనలలో పని చేశారు. అంతరిక్ష యానం చేసిన మొట్టమొదటి మహిళా వ్యోమగామి వాలెంతినా తెరిష్కోవా.రష్యాకు చెందిన ఆమె 1963లో తొలిసారి అంతరిక్షయానం చేశారు. అప్పట్లో అంతరిక్ష యానం, పరిశోధనల విభాగంలో మహిళలను ఎంపిక చేసుకోవడం చాలా అరుదుగా ఉండేది. 1980ల నుంచి మహిళా వ్యోమగాముల సంఖ్య పెరిగింది. ఎక్కువమంది మహిళా వ్యోమగాములు అమెరికా పౌరులుకాగా, వారు ఎక్కువగా అంతరిక్ష నౌకలోనే పనిచేసున్నారు. చైనా, రష్యా, అమెరికా దేశాలు అంతరిక్ష యాన విభాగాల్లో మహిళలకు ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు. వీటితో పాటు కెనడా, ఫ్రాన్స్, భారత్, ఇరాన్, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, యునైటెడ్ కింగ్‌డమ్ దేశాలు కూడా రష్యా లేదా యుఎస్ అంతరిక్ష మిషన్స్ లో తమ మహిళా వ్యోమగాములను పంపాయి.

Read more : Solar Flowers : ఈ పువ్వుల్ని చన్నీళ్లలో వేస్తే వేడినీళ్లు రెడీ
అంతరిక్షంలో మహిళలు పురుషులు ఎదుర్కొంటున్న అన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. భూమ్యేతర పరిస్థితుల వల్ల కలిగే శారీరక ఇబ్బందులు, ఒంటరితనం, వేరుపడటం వల్ల కలిగే యొక్క మానసిక ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. అయితే దీర్ఘకాలం పాటు అంతరిక్ష ప్రయాణం వారి పునరుత్పత్తిపై ఎంతమేర ప్రభావం చూపిస్తుంది అనే విషయాలు మాత్రం ఈ టెక్నాలజీ యుగంలో అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు. ఏది ఏమైనా పురుషులతో పాటు మహిళలు కూడా దేంట్లోనేమేం తక్కువకాదని నిరూపిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు