Solar Flowers : ఈ పువ్వుల్ని చన్నీళ్లలో వేస్తే వేడినీళ్లు రెడీ

వేడినీళ్లు కాలంటే ఈ పువ్వుల్ని నీళ్లల్లో వేస్తే చాలా వేడినీళ్లు రెడీ. రంగు రంగుల్లో అందాలొలికే పువ్వుల్ని నీళ్లలో వేస్తే చిటికెలో వేడినీళ్లు రెడీ అయిపోతున్నాయి..

Solar Flowers : ఈ పువ్వుల్ని చన్నీళ్లలో వేస్తే వేడినీళ్లు రెడీ

Solar Panel Flowers In Swimming Puls

Solar Panel Flowers Heat Up Your Pool : వేడినీళ్లు కావాలంటే..పొయ్యిమీద పెట్టి కాచుకుంటాం. లేదా హీటర్‌ పెట్టుకోవడం లేదా గీజర్ ఆన్‌ చేసుకుంటాం. కానీ ఇవేమీ లేకుండాలనే వేడినీళ్లు కావాలంటే..? పువ్వుల్ని నీళ్లల్లో వేస్తే సరి..వేడి నీళ్లు రెడీ. ఏంటీ పువ్వుల్ని నీళ్లల్లో వేస్తే వేడినీళ్లు ఎలా రెడీ అవుతాయనే డౌట్ రానే వస్తుంది. మరి ఈ పువ్వులేంటీ? వేడినీళ్ల విషయం ఏంటో తెలుసుకుందాం..

ఎందుకంటే ఈ పువ్వులు సోలార్‌ ప్యానెల్‌తో తయారు చేసిన పూలు. వీటిని నీటిలో వేసినప్పుడు అవి సూర్యకాంతిని గ్రహించి చాలా తక్కువ సమయంలోనే చల్లని నీళ్లను వేడినీటిగా మారుస్తాయన్నమాట. దీంతో ఈ సోలార్ ఫ్లవర్స్ ను కొనుక్కుంటున్నారు జనాలు. స్మిమ్మింగ్ పూల్స్ లో వేడినీళ్లు కావాలంటే ఈ సోలార్ ప్యానెల్ ఫ్లవర్స్ ని పూల్ లో వేస్తే కాసేపటికే పూల్ లో నీళ్లు వేడిగా మారతాయి. దీంతో చాలామంది స్విమ్మింగ్‌ పూల్‌లో వేసేసుకుని చక్కగా వేడినీటి తానాలు చేస్తున్నారు.

Read more :Eye Treatment With IPhone : ‘ఐ’ ఫోన్‌13తో ‘ఐ’ ట్రీట్మెంట్‌ చేస్తున్న డాక్టర్..

మరి స్విమ్మింగ్ పూల్స్ అందరికి ఉండవు కదా. లేనివాల్లు బక్కెట్ల నిండా నీరు నింపి వాటిలో ఈ సోలార్ ఫ్లవర్స్ వేసి బాల్కనీలోనో లేదా ఆరుబయట ఖాళీ స్థలం ఉన్నవారు ఎండపడే ప్రాంతంలో పెడితే కాసేపటికే వేడినీళ్లు రెడీ అయిపోతాయి. అలా చాలామంది ఈ సోలార్ పూలను కొనుక్కుంటున్నారు. ఈ సోలార్ పూలు చూడటానికి కూడా చాలా అందంగా ఆకర్షణియంగా ఉంటున్నాయి. రంగు రంగుల్లో లభిస్తన్నాయి. దీంతో స్విమ్మింగ్ పూల్ లో అందానికి అందం..వేడినీటి వేడినీరు లభిస్తుండటంతో ఈ పూలను బాగా కొంటున్నారు.

ఈ పూలు పూల్ లో వేస్తే తామరపూలు ఎంటే ఆ కొలనుకి ఎంత అందం వస్తుందో ఈ పూలు వేస్తే పూల్ కూడా అంతే అందంగా కనిపిస్తున్నాయి. అంతేనా..ఈ సోలార్ పూలు ఒక ప్యాక్‌కి 12 ఉంటాయి. ఒకే రంగు కాకుండా రంగు రంగుల్లో లభిస్తున్నాయి. ఎక్కువగా నీలం,నలుపు, రెయిన్‌బో హ్యూడ్‌ రంగులలో లభిస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం. మీరు కూడా ఈ సోలార్ ప్యానెల్ ఫ్లవర్స్ ని కొనుక్కోండీ..కరెంట్, గ్యాస్ ఖర్చు లేకుండా వేడినీళ్లు తయారుచేసుకోండి…

Read more :Rapper Dan Sur అది జుట్టా బంగారం కొట్టా..! హెయిర్ స్టైల్ కోసం రూ.14 కోట్లు ఖర్చుచేసిన ర్యాపర్