Colleges Reopen: ఏపీలో ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త.. కళాశాలల పున:ప్రారంభం తేదీలో మార్పు
AP Inter Colleges :షెడ్యూల్ ప్రకారం.. వేసవి సెలవులు అనంతరం ఏపీలో జూన్ 1వ తేదీన జూనియర్ కళాశాలలు పున: ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, ఇంటర్మీడియట్ విద్యాశాఖ మార్పులు చేసింది..
Andhra Pradesh Inter Colleges to Reopen From June 6
AP Inter Colleges: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యార్థులకు ఇచ్చిన వేసవి సెలవులు త్వరలో ముగియనున్నాయి.. కళాశాలలు, పాఠశాలలు పున: ప్రారంభం అయ్యేందుకు మరికొద్దిరోజులే సమయం ఉంది. రెండు రాష్ట్రాల విద్యాశాఖలు ఇప్పటికే కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్లను విడుదల చేశాయి. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి రంజిత్ బాషా జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Aslo Read – Janasena Rajya Sabha Race: లింగమనేనా? నాగబాబా? పెద్దల సభకు పవన్ పంపేది ఎవరిని..
షెడ్యూల్ ప్రకారం.. వేసవి సెలవులు అనంతరం ఏపీలో జూన్ 1వ తేదీన జూనియర్ కళాశాలలు పున: ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, జూన్ 1వ తేదీన కాకుండా 6వ తేదీన పాఠశాలలు పున:ప్రారంభం చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ నిర్ణయించింది. ఎందుకంటే.. జూన్ ఐదో తేదీ వరకు ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉండటంతో ఈ మార్పులు చేశారు. తాజా ఉత్తర్వుల ప్రకారం.. జూన్ 6వ తేదీ నుంచి జూనియర్ కాలేజీలు పున: ప్రారంభించాలని సూచించారు. అయితే, అకడమిక్ క్యాలెండర్ ప్రకటించిన మిగతా కార్యక్రమాల్లో ఎలాంటి మార్పూ ఉండదని తెలిపారు.
మరోవైపు స్కూల్ విద్యార్థులకు జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు కొనసాగనున్నాయి. జూన్ 12వ తేదీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. దీంతో సుదీర్ఘ వేసవి సెలవుల అనంతరం విద్యార్థులు మళ్లీ బడిబాట పట్టనున్నారు.
