Kabul mosque attack: అఫ్గాన్‌లో బాంబు పేలుళ్ళు.. 20 మంది మృతి.. 40 మందికి గాయాలు

అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్ మరోసారి బాంబు పేలుళ్ళతో దద్దరిల్లిపోయింది. ఈ పేలుళ్ళలో 20 మంది ప్రాణాలు కోల్పోగా, 40 మందికి గాయాలయ్యాయి. ఖైర్ ఖానా ప్రాంతంలోని మసీదులో నిన్న సాయంత్రం ప్రార్థనలు ముగిసిన అనంతరం ఈ బాంబు పేలుళ్ళు చోటుచేసుకున్నాయని అధికారులు వివరించారు.

Kabul mosque attack: అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్ మరోసారి బాంబు పేలుళ్ళతో దద్దరిల్లిపోయింది. ఈ పేలుళ్ళలో 20 మంది ప్రాణాలు కోల్పోగా, 40 మందికి గాయాలయ్యాయి. ఖైర్ ఖానా ప్రాంతంలోని మసీదులో నిన్న సాయంత్రం ప్రార్థనలు ముగిసిన అనంతరం ఈ బాంబు పేలుళ్ళు చోటుచేసుకున్నాయని అధికారులు వివరించారు. అఫ్గానిస్థాన్ మొత్తం తమ నియంత్రణలో ఉందని తాలిబన్లు అంటున్నారు. అయితే, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దేశ వ్యాప్తంగా పౌరులు, పోలీసులపై పదే పదే దాడులు కొనసాగిస్తున్నారు.

ఈ బాంబు పేలుళ్ళలో మృతి చెందిన వారి గురించి తాలిబన్లు అధికారికంగా ప్రకటన చేయలేదు. ఈ పేలుళ్ళకు బాధ్యతవహిస్తున్నట్లు ఏ ఉగ్ర సంస్థా ఇప్పటివరకు ప్రకటన చేయకపోవడం గమనార్హం. రెండు వారాల క్రితమే అఫ్గాన్ లో బాంబు పేలుళ్ళు చోటుచేసుకుని 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మందికి తీవ్రగాయాలయ్యాయి.

ఆ పేలుళ్ళకు పాల్పడింది తామేనని అప్పట్లో ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. ఈ ఘటనను మరవకముందే మళ్ళీ బాంబు పేలుళ్ళు చోటుచేసుకున్నాయి. మరోవైపు, అఫ్గాన్ ను తమ అధీనంలోకి తీసుకున్నాక తాలిబన్లు మానవ హక్కుల ఉల్లంఘనలను కొనసాగిస్తున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. తమ పాలన వచ్చాక శాంతి కోసం కృషి చేస్తామని తాలిబన్లు ఇచ్చిన హామీలు నెరవేరట్లేదు.

World Most Polluted Cities: ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాల జాబితాలో భారత్‌లోని ఆ రెండు నగరాలు..

ట్రెండింగ్ వార్తలు