Amazon Farest : అమెజాన్ అడవుల్లో తప్పిపోయి..30 రోజులకు బతికిబయటపడ్డ యువకుడు..ఏం తిన్నాడో ఏం తాగాడో తెలిస్తే వాంతి రావాల్సిందే..

అమెజాన్ అడవుల్లో తప్పిపోయి..30 రోజులకు బతికిబయటపడ్డ యువకుడు..ఏం తిన్నాడో ఏం తాగాడో తెలిస్తే వాంతి వస్తుంది..

Amazon Farest : అమెజాన్ అడవులు. సమస్త జీవరాశికి జీవనాడిగా పేరొందిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచి అడవులు. ప్రపంచానికి 20శాతం ఆక్సిజన్ ఇచ్చే అమెజాన్ అడవులు ఎంత అందమైనవో అంత రహస్యాలను దాచుకున్న పచ్చని ప్రకృతికి ఆలవాలంగా విలసిల్లుతున్నాయి. వింత వింత అత్యంత అరుదైన జీవులకు ఆలవాలంగా విలసిల్లే ఆ అమెజాన్ అడవుల్లో పొరపాటుగానీ..ప్రమాదవశాత్తుగాని మనిషి తప్పిపోయాడా? ఇక అంతే..ప్రాణాలమీద ఆశ వదులుకోవాల్సిందే. ఆ అడవుల గురించి క్షుణ్ణంగా తెలిసివారు తప్ప ఎవ్వరు ప్రాణాలతో బయటపడలేదు. అటువంటి అమెజాన్ అడవిలో ఓ యువకుడు తప్పిపోయాడు. అలా 31 రోజులు అడవుల్లోనే గడిపాడు. తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు లేదు. కానీ బతికి బటయపడ్డాడు.

ప్రాణాలతో ఈ ప్రపంచాన్ని తిరిగి చూస్తాననే అనుకోలేదు. కానీ ఏదో ఆశ..అతడిని బతికించింది. బతటానికి చేయాల్సిన పోరాటం అంతా చేశాడు. పోరాటం అంటే ఎవరితోనో కాదు..ఎటునుంచి ఏ జంతువు వచ్చి కబళిస్తుందో తెలియదు. అంత్యంత ప్రమాదకరమైన ఆటవిక తెగలు ఉండే ఆ అమెజాన్ ఫారెస్ట్ లో ఏ తెగకైనా చిక్కితే అంతే..ఇక ప్రాణాలు పోగొట్టుకోవాల్సింది. నరమాంస భక్షకులు అమెజాన్ అడవుల్లో జీవిస్తుంటారని అంటారు. అలా వారికి చిక్కితే అంతే..అలా బతకటానికి చేసిన పోరాటం..కడుపు నకనకలాడిపోయే ఆకలి. పేగుల్ని నలిపేస్తుంటే కంటికి కనిపించిన పురుగుల్ని..వానపాముల్ని తిని బతికాడు. వర్షం వచ్చినప్పుడు ఆనీరు తాగుతు..వర్షం పడకపోతే తాగటానికి నీరు లేక తన మూత్రాన్నే తాగి ప్రాణాలు నిలబెట్టుకున్నాడు. అలా ఎట్టకేలకు తన కుటుంబాన్ని కలవాలనే తపనతో పురుగుల్ని తింటూ..తన మూత్రాన్నే తాగుతూ జీవించాడు. ఎట్టకేలకు 31 రోజులకు బతికి ప్రాణాలతో బయపడ్డాడు.

supply 20 of oxygen : ప్రపంచానికి 20 శాతం ఆక్సిజన్‌ ఇచ్చే ప్రాంతం..ప్రకృతికి ఆలవాలం..సమస్త జీవరాశికి జీవనాడి ఇదే..

ఉత్తర బొలీవియాకు చెందిన 30 ఏళ్ల జొనట్టన్ అకోస్టాగా అనే యువకుడు తన స్నేహితులతో కలిసి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో సాహస యాత్ర చేశాడు. ఈక్రమంలో స్నేహితులతో కలిసి పచ్చని అడవి అందాలను చూస్తూ తిక్ ఫారెస్ట్ లోకి వెళ్లిపోయారు. అలా వెళ్లిన తరువాత తన స్నేహితులను తనకు తెలియకుండానే వదిలేశాడు. అడవిలో తప్పిపోయాడు. స్నేహితుల కోసం వెదికాడు. కానీ కనిపించలేదు. ఎటు చూసినా కంటికి కనిపించినంత దూరం అడవే. వచ్చినదారి మర్చిపోయాడు. అలా అలా అడవిలోపలికి వెళ్లిపోయాడు. కానీ అక్కడినుంచి బయటపడాలో ఆలోచించాడు. తిరిగి తిరిగి అలసిపోయాడు. తినటానికి తిండిలేదు. తాగటానికి నీళ్లు లేవు. గొంతు పిడకకట్టుకపోతోంది. ఆకలి దహించివేస్తోంది. ప్రాణాలను కాపాడుకోవటానికి గొంతు తడుపుకోవటానికి వర్షం వస్తున్నప్పుడు తన షూ విప్పి సాక్సుల్లో వర్షపు నీటిని పట్టుకుని తాగి దాహం తీర్చుకున్నాడు.

ఆకలికి తట్టుకోలేక కంటికి కనిపించిన పురుగులు తినేవాడు. వాన పాములను, కీటకాలను తినేవాడు. ఏదన్నా విషపు పురుగుని తింటే అంతే..ఇక ప్రాణాలమీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. కానీ అలా ఆలోచిస్తూ కూర్చుంటే ఆకలి తీరదు. వేరే దారిలేదు. అలా వానపాముల్ని, కీటకాలను తింటూ బతికాడు. వర్షపు నీరు తాగేవాడు. ఆ నీరు అయిపోతే తన మూత్రాన్ని తానే తాగి ప్రాణాలు నిలబెట్టుకున్నాడు. ఇక మరోపక్క ఏ పక్కనుంచి ఏ జంతువు, ఏ మృగం దాడి చేస్తుందో తెలియదు. అనుక్షణం అప్రమత్తంగా ఉండేవాడు. దాని కోసం సాహసాలే చేసేవాడు. అలా అతను ఓ పక్క బతకటానికి పోరాటం చేస్తూనే మరోపక్క తన స్నేహితుల కోసం వెదికేవాడు. అలా ఒక రోజు కాదు ఒక వారం కాదు 31 రోజులు ఆ అమెజాన్ అభయారణ్యంలోనే బతికాడు.

అడవిలోంచి బటయపడటానికి జొనట్టన్ పోరాటం ఇలా ఉంటే మరోపక్క అతను కనిపించకపోవటంతో అతని స్నేహితులు అడవిలో అదృశ్యమైన వెంటనే..అతని కుటుంబ సభ్యులు అతని కోసం వెతకడం ప్రారంభించారు. అలా 31 రోజుల తరువాత..తన కోసం వెదుకుతున్న రెస్క్యూ టీమ్ ను గుర్తించాడు. అలా అరుస్తూ పొదల్లోంచి నడవలేని స్థితిలో కుంటుకుంటూ బయటకు వచ్చాడు. అప్పటికే అతను డీహైడ్రేట్ అయపోయాడు. 17 కిలోల బరువు తగ్గిపోయాడు. ప్రాణాలు కళ్లల్లోకి వచ్చేసి అత్యంత నీరసరంగా కనిపించాడు. కౄరమృగాలు సంచారించే అమెజాన్ అడవుల నుంచి ఇలా ప్రాణాలతో బయటపడ్డ అతను చేసింది పెద్ద సాహసమనే చెప్పాలి.ఆఖరికి ప్రాణాలతో బయటపడ్డాడు.

కనీసం నడవలేని స్థితిలో ఉన్న జొనట్టన్ ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం జొనట్టన్ తన కుటుంబ సభ్యులతో ఉన్నాడు. కోలుకుంటున్నాడు. తను అమెజాన్ అడవుల్లో ప్రాణాలతో బయటపటానికి ప్రాణాలు నిలుపుకోవటానికి చేసిన సాహసాల్ని కథలు కథలుగా చెప్పుకొచ్చాడు. ఇవన్నీ చెబితే నమ్మకపోవచ్చు..కానీ పురుగుల్ని తిన్నాను..నా మూత్రాన్నే నేను తాగాను..అలా ప్రాణాలు నిలబెట్టుకుని నా కుటుంబాన్ని చేరుకున్నాను..ఇదంతా దేవుడు దయ అంటున్నాడు 30 ఏళ్ల జొనట్టన్ అకోస్టాగా..

 

ట్రెండింగ్ వార్తలు