supply 20 of oxygen : ప్రపంచానికి 20 శాతం ఆక్సిజన్‌ ఇచ్చే ప్రాంతం..ప్రకృతికి ఆలవాలం..సమస్త జీవరాశికి జీవనాడి ఇదే..

యావత్ ప్రపంచానికి 20 శాతం ఆక్సిజన్ అందించే ప్రాంతం. సమస్త జీవరాశికి జీవనాడి ఇదేగా విలసిల్లుతోంది. పచ్చదనానికి విభిన్న జాతుల నివాసానికి..వింత వింత జీవులకు ఆలవాసంగా భాసిస్తోంది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్.

supply 20 of oxygen : ప్రపంచానికి 20 శాతం ఆక్సిజన్‌ ఇచ్చే ప్రాంతం..ప్రకృతికి ఆలవాలం..సమస్త జీవరాశికి జీవనాడి ఇదే..

Supply 20 Of Oxygen

Most beautiful amazon rain forest supply 20 of oxygen : పచ్చదనం ఎక్కడుంటే ప్రాణవాయువు అక్కడే ఉంటుంది. పచ్చదానికి ప్రాణవాయువుకి అదే సంబంధం. సమస్త జీవరాశి ప్రాణాలతో ఉండాలంటే ప్రాణవాయువే ఆధారం. అటువంటి ప్రాణవాయువు (ఆక్సిజన్) కోసం ఈ కరోనా కాలంలో మానవాళి పరితపించిపోతోంది. ఆక్సిజన్.. ఆక్సిజన్.. ఆక్సిజన్.. ఎక్కడ విన్నా ఇదే మాట. మనం తీసుకున్న గోతిలో మనమే పడినట్లుగా ఉంది నేటి దుస్థితి. చెట్లను సరికేస్తూ..ప్రాణవాయుని చిదిమేస్తూ..అభివృద్ది..అభివృద్ది అని వెర్రెత్తాం. కానీ ఇప్పుడు ఆ పచ్చదనం కరవై..ప్రాణవాయువు అందక అల్లాడిపోతున్నాం. కానీ ఓ ప్రాంతం మాత్రం ఈ ప్రపంచంలోనే సమస్త జీవరాశులకు ప్రాణవాయువుని ఇస్తోంది. పచ్చదనానికి..విభిన్నరకాల జీవరాశులకు ఆలవాలంగా నిలుస్తోంది. అదే ‘అమెజాన్’ రెయిన్‌ఫారెస్ట్. యావత్ ప్రపంచానికి 20 శాతం ఆక్సిజన్ అందిస్తోంది. సమస్త జీవరాశికి జీవనాడి ఇదేగా విలసిల్లుతోంది.

4

 

కరోనా మహమ్మారి వలన ఆక్సిజన్ అవసరం ఏంటో జనాలకు తెలిసొచ్చింది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఈ ప్రాణవాయువు కోసం పరితపించిపోతున్నారు. ఊపిరి నిలుపుకోవటానికి అల్లాడిపోతున్నారు. ఆక్సిజన్ అందించే చెట్లను నరికి ఆకాశాన్ని తాకే భవనాలు కట్టేస్తూ తెగ మురిసిపోయే జనాలు ఇప్పుడా ప్రాణవాయువు కోసం అంగలారుస్తున్నారు. దీని ఫలితంగా మానవ మనుగడే కష్టంగా మారిపోయింది. కానీ ఓ ప్రదేశం మాత్రం యావత్ ప్రపంచానికి ఆక్సిజన్ అందిస్తోంది. ప్రపంచంలో అతిపెద్ద అడవులలో ఒకటి దక్షిణ అమెరికాలోని అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్.

7

హలో అంటే చాలు భారీ వర్షాలు కుంభవృష్టిగా కురిచేసే ఈ వర్షారణ్యం అమెజాన్ బేసిన్ సరిహద్దులో అత్యంత భారీ ప్రాంతంలో విస్తరించి ఉంది. ఎటు చూసినా పచ్చదనం. ఎటు చూసినా ఎక్కడా చూడనటువంటి జంతువులు. పక్షులు.కీటకాలు. వింత వింత ప్రాణులకు ఆలవాలంగా భాసిల్లుతోంది ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. ఈ అడవిలో 25 లక్షల జాతుల కీటకాలు మనుగడ సాగిస్తున్నాయి ఏమాత్రం చీకూ చింతా లేకుండా. ఎందుకంటే వాటికి కావాల్సినంత ప్రాణవాయువు ఉంది కాబట్టి. వేలాది రకాల మొక్కలు,చెట్లు..రెండు వేల రకాల జంతువులు, పక్షులు నివసిస్తుంటాయి ఈ ఫారెస్ట్ లో.

3

అమెజాన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఉష్ణమండల వర్షారణ్యం. 5.5 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ రెయిన్‌ఫారెస్ట్ చాలా చాలా పెద్దది. బ్రిటన్, ఐర్లాండ్ దీనికి 17 సార్లు విస్తీర్ణం సరిపోతుంది. దాని పెద్ద పరిమాణం కారణంగా ఇది ప్రపంచానికి 20 శాతం ఆక్సిజన్‌ను సరఫరా చేస్తోంది. దక్షిణ అమెరికాలో ఉన్న అమెజాన్ అడవి తొమ్మిది దేశాల సరిహద్దులో విస్తరించి ఉంది. ఇందులో బ్రెజిల్, బొలీవియా, పెరూ, ఈక్వెడార్, కొలంబియా, వెనిజులా, గయానా, సురినామ్, ఫ్రెంచ్ గయానా ఉన్నాయి. ఈ అడవి 60 శాతం బ్రెజిల్‌లోనే ఉంది.

6

అమెజాన్ నది వర్షారణ్యానికి ఉత్తరాన ప్రవహిస్తుంది, ఇది వందలాది జలమార్గాల నెట్ వర్క్ 6,840 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. అయితే ఈ విషయానికి సంబంధించి చాలా వివాదాలు ఉన్నాయి. నైలు నది తరువాత అమెజాన్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద నది అని చాలా మంది శాస్త్రవేత్తలు అంటున్నారు. అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్ 400-500 దేశీయ అమెరిండియన్ తెగలకు నిలయంగా విలసిల్లుతోంది.ఇక్కడ నివసించే యాభై రకాల అడవి తెగలకు అసలు బయటి ప్రపంచంతో సంబంధం లేదు. అసలు బయటి ప్రపంచంతో వారికి పనేలేదు. ఎందుకంటే వారికి కావాల్సినవన్నీ అమెజాన్ అందిస్తోంది కన్నతల్లిలాగా.

Fish

ప్రపంచంలోని కొన్ని ఆసక్తికరమైన, ప్రమాదకరమైన జీవులు వర్షారణ్యంలో నివసిస్తున్నాయి. ఇందులో ఎలక్ట్రిక్ ఈల్స్, మాంసం తినే పిరాన్హా చేపలు, విషపు కప్పలు, జాగ్వార్‌లు, నదిలల్లో అత్యంత విషపూరిత పాములు ఇక్కడ ఉంటాయి. అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లో పిరారుకు అని పిలువబడే భారీ చేప గురించి ఎన్ని వింత వింత కథనాలు ఉన్నాయి. ఈ చేప మూడు మీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. దాని నోటికే కాదు..నాలుక రెండింటికి దంతాలు ఉంటాయి.దీంతో దీని నోట్లో ఏ చేప పడినా అది ప్రాణాలతో బైటపడటం అసాధ్యం.

2

అపారమైన ప్రకృతి సౌందర్యం అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్ సొంతం. అంతేకాదు ఈ ఫారెస్టులో వాతావరణ మార్పులను పరిమితం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. గొప్ప వృక్షసంపద గాలి నుండి కార్బన్ డయాక్సైడ్ తీసుకొని ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లోని దట్టమైన చెట్ల వల్ల దాని ఉపరితలంపై ఎప్పుడూ చీకటి ఉంటుంది. అంటే సూర్యుడి కిరణాలు కూడా నేలను తాకనంత దట్టంగా ఉంటుందీ ఫారెస్ట్. ఎంత దట్టంగా ఉంటుందంటే.. వర్షం పడినప్పుడు నీరు కిందకు చేరుకోవడానికి 10 నిమిషాలు పడుతుంది. అంటే ఎంత దట్టంగా ఉంటుందో ఊహించుకోవచ్చు..