జంతువులకు హెలికాఫ్టర్ల సహాయంతో ఆహారం

  • Publish Date - January 13, 2020 / 06:01 AM IST

ఆస్ట్రేలియాలో కార్చిచ్చు వల్ల చాలా రకాల జాతి జంతువులు చనిపోయాయి. కార్చిచ్చు వల్ల దేశానికి చెందిన లక్షలాది జంతువులను కాపాడటంలో ప్రభుత్వం విఫలం కావటం, వాతావరణ మార్పులు పట్ల అక్కడి ప్రజలు, కార్యకర్తలు నిరసనలు చేస్తున్నారు. కార్చిచ్చు తర్వాత ఆహారం దొరక, ఆకలితో ఉన్నజంతువుల కోసం హెలికాప్టర్ల సహాయంతో ఆహారాన్ని కిందకు పడేస్తున్నారు.
 
కార్చిచ్చు తర్వాత ఆకలితో ఉన్న జంతువుల కోసం ప్రభుత్వం క్యారెట్లు, తీపి బంగాళాదుంపలను హెలికాప్టర్లు, ఛాపర్లు సహాయంతో ఆహారాన్ని కిందకు విసిరే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జంతువులకు ఆహారాన్ని అందించటం కోసం ‘రాక్ వాలబీ’ అనే పేరుతో ఆపరేషన్ ప్రారంభించినట్లు న్యూసౌత్ వేల్స్ పర్యావరణ మంత్రి మాట్ కీన్ డైలీ మెయిల్ చెప్పారు. 

జంతువులకు ఆహారాన్ని అందించటానికి  అనేక రకాల ఛాపర్లు, హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఇప్పటివరకు కాపర్ ట్రీ, వోల్గాన్ లోయలు, యెంగో నేషనల్ పార్క్, కంగారు లోయ, జెనోలన్, ఆక్ల్సీ వైల్డ్ రివర్స్ వంటి నేషనల్ పార్క్ లో 2 వేల 200 కిలోల కూరగాయలను పడేసిందని పర్యావరణ మంత్రి మాట్ కీన్ డైలీ మెయిల్ తెలిపారు.