Australia Anti Vaccine
Australia Anti Vaccine : ఆస్ట్రేలియాలో కరోనా వ్యాక్సిన్ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారాయి. దేశంలో రోజు రోజుకు కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు.దీంతో నిరసనలకు దిగటం అదికాస్తా హింసాత్మకంగా మారాయి. ఇంతకీ ఎందుకింత వ్యతిరేకత వెల్లువెత్తింది అంటే..ఒక్క డోసైనా వేసుకున్న కార్మికులే పనులకు వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించటంతో కార్మికులు ఆందోళనకు దిగటం అవికాస్తా హింసాత్మకంగా మారాయి. దీంతో నిర్మాణ రంగ పనులు రెండు వారాలపాటు నిలిపివేయిన పరిస్థితి నెలకొంది.
Read more : Vaccination Effects: కరోనా వ్యాక్సిన్ తో రుతుక్రమంలో మార్పులు వస్తాయా?!..పరిశోధకులు ఏం చెబుతున్నారంటే..
కాగా..దేశంలోని విక్టోరియా, న్యూ సౌత్‌వేల్స్‌లలో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరుగతున్న క్రమంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం కేసుల్ని నియంత్నించే పనిలో పడింది. దీంట్లో భాగంగా నిర్మాణరంగంలో పనిచేసే కార్మికులు కనీసం ఒక డోసు టీకా అయినా తీసుకున్నాకే పనికి వెళ్లాలని ఆదేశించింది.
ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెల్‌బోర్న్‌లో వందలాదిమంది కార్మికులు రోడ్లపైకి వచ్చి గత రెండు రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. దీంతో పోలీసులు అడ్డుకోవటానికి శతవిధాలా యత్నిస్తున్నారు. పోలీసులు రంగంలోకి దిగడంతో కార్మికులు మరింతగా రెచ్చిపోయారు. పోలీసుల్ని కూడా లెక్క చేయట్లేదు. దీంతో పోలీసులు నిరసనకారుల్ని అదుపులోకి తీసుకోవాటానికి యత్నిస్తున్న క్రమంలో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయాయి.
Read more : viral pic:కరోనా టీకా తీసుకోనందుకు..రోడ్డుపై నిలబడి పిజ్జా తిన్న బ్రెజిల్ అధ్యక్షుడు..
నిరసనకారులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసు అధికారులు సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పరిస్థితిపై వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం మెల్‌బోర్న్‌లో నిర్మాణ రంగ పనులను రెండు వారాలపాటు నిలిపివేస్తున్నామని ప్రకటించింది.