Vaccination Effects: కరోనా వ్యాక్సిన్ తో రుతుక్ర‌మంలో మార్పులు వస్తాయా?!..పరిశోధకులు ఏం చెబుతున్నారంటే..

కరోనా వ్యాక్సిన్ వచ్చి ఇంతకాలమైనా..ఈనాటికి ఎన్నో అనుమానాలు..వస్తునే ఉన్నాయి. ఈ క్రమంలో వ్యాక్సిన్ వేయించుకున్న మహిళల్లో రుతుక్రమంలో మార్పులు వస్తాయా? దీనిపై పరిశోధకులు ఏమంటున్నారు?

Vaccination Effects: కరోనా వ్యాక్సిన్ తో రుతుక్ర‌మంలో మార్పులు వస్తాయా?!..పరిశోధకులు ఏం చెబుతున్నారంటే..

Covid Vaccination Menstrual Changes

covid-19 Vaccination Effects: కరోనా వ్యాక్సిన్ వచ్చి దాదాపు 10నెలలు కావస్తోంది. ఎంతోమంది వేయించుకుంటున్నారు. కానీ ఈ వ్యాక్సిన్ వేయిచుకునే విషయంలో ఈనాటికి ఎన్నో అనుమానాలు. వస్తునే ఉన్నాయి. దీంతో పలు దేశాలకు చెందిన సైంటిస్టులు పరిశోధనలు చేస్తునే ఉన్నారు.ఈ క్రమంలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మహిళ్లలో రుతుక్రమంలో మార్పులు వస్తున్నాయా? కరోనా వాక్సిన్ వేయించుకున్నవారికంటే వేయించుకోనివారే ఎక్కువగా చనిపోతున్నారు.కాబట్టి ప్రతీ ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని పదే పదే చెబుతున్న క్రమంలో ఈ వ్యాక్సిన్ వేయించుకున్న మహిళల్లో రుతుక్రమంలో తేడాలు వస్తున్నాయనే వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.

కరోనా మహమ్మారికి కళ్లెం వేసే ఏకైక మార్గం కోవిడ్-19 టీకా తీసుకోవడమే. అయితే టీకా అందుబాటులోకి వచ్చి చాలా రోజులు అవుతున్నా కూడా కొందరిలో కొన్ని అనుమానాలు అలాగే ఉండి పోతున్నాయి. ఈ అనుమానాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మ‌హిళ‌ల రుతుక్ర‌మంలో మార్పులకు, కరోనా టీకాకు సంబంధం ఉందా?అలా ఉంటుందా? అనే అనుమానం చాలా మందిలో నెలకొనే ఉంది. ఈ క్రమంలోనే రుతుక్రమ మార్పులకు, కరోనా టీకాకు మధ్య సంబంధం ఉండొచ్చని బ్రిటీష్ మెడిక‌ల్ జ‌ర్న‌ల్‌ (BMI)లో ప్రచురించిన ఒక ఎడిటోరియల్ అభిప్రాయ‌ప‌డింది. అంతేకాదు..దీనిపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఈ ఎడిటోరియల్ సూచించింది.

Read more : Vaccination అలర్ట్.. వ్యాక్సిన్ తీసుకున్న 20 రోజుల్లోపు ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే
కోవిడ్-19 టీకా వేసుకున్న తర్వాత తలెత్తే కామన్ సైడ్ ఎఫెక్ట్స్ లిస్టులో ఊహించని విధంగా పీరియడ్స్/ వజైనల్ బ్లీడింగ్ అవుతుందని ఎక్కడా ప్రస్తావించలేదని యూకేలోని ఇంపీరియల్ కాలేజ్, లండన్ లో రిప్రొడక్టివ్ స్పెష‌లిస్టుగా పని చేస్తున్న డాక్టర్ విక్టోరియా మేల్ ఎడిటోరియల్‌లో పేర్కొన్నారు. ప్రతికూల ఔషధ రియాక్షన్ కోసం ఏర్పాటైన నిఘా/పర్యవేక్షణ పథకం ‘యూకే మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులటరీ ఏజెన్సీ (MHRA)’కు సెప్టెంబర్ 2 నాటికి 30,000 పైగా రిపోర్ట్స్ అందాయని విక్టోరియా తెలిపారు. ఆ రిపోర్టులలో టీకా తీసుకున్న తర్వాత పీరియడ్స్ రావడం.. లేదా వజైనల్ బ్లీడింగ్ కావడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినట్లుగా మహిళలు పేర్కొన్నారు.

కానీ ఈ తరువత నెలలో పీరియడ్స్ మళ్లీ రెగ్యులర్ వచ్చాయని సదరు మహిళలు తెలిపారని విక్టోరియా మేల్ వెల్లడించారు. మహిళల సంతానోత్పత్తిపై కోవిడ్ 19 టీకా ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని ఆమె అన్నారు. అయితే భవిష్యత్తులో వైద్య చికిత్స వల్ల మహిళల రుతుస్రావంపై ప్రభావం పడుతుందనే అనుమానాలపై పరిశోధనలు ఇంకా కూలంకష్టంగా చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

Read more : కరోనా వ్యాక్సిన్ పై కేంద్రం గుడ్ న్యూస్

రుతుక్రమంలో మార్పులు..కోవిడ్-19 టీకాల మధ్య సంబంధం ఉందని చెప్పడానికి తమ పర్యవేక్షణ డేటా మద్దతు ఇవ్వదని ఎంహెచ్ఆర్ఏ పేర్కొంది. టీకాలు తీసుకున్న వ్యక్తుల సంఖ్య, రుతుక్రమం మార్పులు నివేదించిన వ్యక్తుల సంఖ్య తక్కువగా ఉన్నందున ఈ రెండింటి మధ్య లింకు ఉన్నట్లు చెప్పడం లేదని ఎంహెచ్ఆర్ఏ వివరించింది. డేటాను సేకరించిన విధానం కూడా బలమైన నిర్ధారణలకు రావానికి కష్టమేనని విక్టోరియా చెప్పారు.

సరైన నిర్ధారణ కోసం టీకా తీసుకున్న, తీసుకొని వారిలో పీరియడ్స్ మార్పుల రేట్లను సరిపోల్చాల్సిన అవసరం ఉందన్నారు. ఎంఆర్ఎన్ఏ, అడినోవైర‌స్ టీకాలు వేసుకున్న మ‌హిళ‌ల రుతుక్ర‌మంలో మార్పులు గ‌మ‌నించిన‌ట్లు రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయని…దీన్నిబట్టి టీకాకు రోగనిరోధక ప్రతిస్పందన ఫలితంగా రుతుక్రమంలో మార్పులు వచ్చాయని మనం అనుకోవాలని విక్టోరియా అభిప్రాయపడ్డారు. అలాగే..టీకా వల్ల పీరియడ్స్ లో మార్పులు రాకపోవచ్చని చెప్పడానికి ఇది ఒక కారణమని అన్నారు.

Read more : కరోనా వ్యాక్సినేషన్ లో ఇండియా నెంబర్ వన్!

ఈ ఎడిటోరియల్ సార్స్- కోవ్-2 సోకిన మహిళల్లో నాలుగింట ఒక వంతు మందిలో పీరియడ్స్ విషయంలో మార్పు వచ్చిందని తేల్చిన ఒక అధ్యయనం గురించి ప్రస్తావించింది. వైరస్‌ తీసుకున్న తర్వాత రోగనిరోధకశక్తిలో మార్పు వచ్చి రుతు చక్రం ప్రభావితమవుతుందని ఎడిటోరియల్ పేర్కొంది. పీరియడ్స్‌లో మార్పులు లేదా ఊహించని వజైనల్ రక్తస్రావం గురించి మహిళా రోగులు తెలియజేసేలా వైద్యులు ప్రోత్సహించాలని డాక్టర్ విక్టోరియా మేల్ తెలిపారు.