ఆస్ట్రేలియాలో ఆరని మంటలు : భయానక దృశ్యాలు ఇదిగో!

ఆస్ట్రేలియాలో కార్చిచ్చు ఉగ్రరూపం దాల్చింది. ఎన్నో జంతువులు పశు పక్షాదులు అగ్నికి అహుతి అయ్యాయి. రోజురోజుకీ మంటలు తీవ్రస్థాయిలో విస్తరిస్తున్నాయి. దట్టమైన పొగ వ్యాపించడంతో పాటు మంటల తీవ్రత ఎక్కువడంతో 5 మిలియన్ల హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న అడవి అంతా అగ్నికిలల్లో దగ్ధం కాగా, 500కు పైగా పక్షులు, జంతువులన్నీ అగ్నీకి ఆహుతి అయ్యాయి. రగిలిపోతున్న కార్చిచ్చుకు సంబంధించి కొన్ని భయానక దృశ్యాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.

1. ఆస్ట్రేలియా, న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలోని నౌరా టౌన్ ప్రాంతంలో కార్చిచ్చు నుంచి ఉద్భవించిన మంటలతో ఆకాశమంతా ఎరుపెక్కింది. మధ్యాహ్నా సమయంలో అగ్నికిలల్లో చెట్లు దగ్ధమైపోతున్న దృశ్యం ఇలా కనిపిస్తోంది.

2. ఆస్ట్రేలియాలోని బెయిర్స్ డేల్ ప్రాంతంలో దట్టమైన పొగతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఆకాశమంతా పొగ వ్యాపించి ఎలా నల్లగా మారిపోయిందో చూడండి.

3. సౌత్ వేల్స్ టౌన్ కబార్గోలోని పలు భవనాలు మంటల్లో దగ్ధమైపోయిన దృశ్యం హృదయవిచారకంగా కనిపిస్తోంది.

4. నౌరా టౌన్ కు సమీపంలోని ఓ రెసిడెన్షియల్ ప్రాపర్టీ దగ్గర మంటల తీవ్రత నుంచి ఓ గుర్రం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న దృశ్యం..


5. కంజోలా లేక్ వెనుక దట్టమైన పొగతో మంటలు ఎగిసిపడుతుండటంతో అక్కడి బోట్లను ఒడ్డుకు చేర్చిన దృశ్యం..


6. మంటలను అదుపు చేసే ప్రయత్నంలో నౌరా టౌన్‌లో కాలిపోయిన చెట్ల ప్రాంతం నుంచి అగ్నిమాపక సిబ్బంది ఒకరు వెళ్తున్న దృశ్యం..


7. విక్టోరియా, సార్స్ ఫీల్డ్ ప్రాంతంలోని ఈస్ట్ గిప్స్ ల్యాండ్ దగ్గర మంటల తీవ్రతతో పూర్తిగా ధ్వంసమైన ప్రాపర్టీ ఎలా నేలమట్టమైందో చూడండి..


8. బాల్ మోరల్ ప్రాంతంలోని ఓ ఇంటి సమీపంలో కార్చిచ్చు కారణంగా దగ్ధమైన కారు ఎలా ఉందో చూడండి.


9. ఈస్టరన్ గిప్స్ డ్యాండ్ ప్రాంతంలో గాల్లోకి దట్టమైన పొగ వ్యాపించడంతో మధ్యాహ్న సమయంలో సూర్యుడు కూడా మరింత ఎర్రగా మారిపోయాడు..


10. ఈస్టరన్ గిప్స్ ల్యాండ్ లోని కెన్ నది, బెమ్ నది దగ్గరి పట్టణ ప్రాంతాల మధ్య కాలిపోతున్న ఎత్తైన చెట్లు..


11. ఈస్టరన్ గిప్స్ ల్యాండ్ లో ఆకాశమంతా దట్టమైన పొగతో నల్లగా మారగా.. పశువులన్నీ భయంతో ఇలా నిలబడిపోయాయి…


12. న్యూ సౌత్ వేల్స్ లో బేట్ మ్యాన్స్ బే బ్రిడ్జ్ ముందు కమ్మేసిన పొగ.. అదే మార్గంలో టూరిస్టులు ఒక కుక్కతో వెళ్తున్న దృశ్యం..


13. విక్టోరియాలోని బెయిరెన్స్ డేల్ ప్రాంతంలో మంటల్లో దగ్ధమైన ప్రాంతం.. ఎలా నిర్మూనుష్యంగా మారిందో చూడండి.

14. ఆస్ట్రేలియాలోని బూ్లూ మౌంటెయిన్స్ సమీపంలో మంటల్లో చిక్కుకున్న ఓ (బ్రష్ టైల్ పాసుమ్) జంతువును కాపాడిన దృశ్యం..

15. న్యూ సౌత్ వేల్స్ లోని బేట్ మ్యాన్స్ బే అవతలివైపు నుంచి ఆకాశంలో నుంచి హెలికాప్టర్ ద్వారా నీటిని వెదజల్లుతూ మంటలను ఆర్పుతున్న దృశ్యం.

ట్రెండింగ్ వార్తలు