కార్చిచ్చు ఆస్ట్రేలియాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే. 2019 సెప్టెంబర్‌లో అడవుల్లో మొదలైన మంటలు ఇంకా మండుతూనే ఉన్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో
కార్చిచ్చు ఆస్ట్రేలియాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే. 2019 సెప్టెంబర్‌లో అడవుల్లో మొదలైన మంటలు ఇంకా మండుతూనే ఉన్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో మనుషులు చనిపోయారు. కోట్లాది అడవి జంతువులు అగ్నికి ఆహుతయ్యాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. న్యూసౌత్ వేల్స్, విక్టోరియా రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. సుమారు 60 లక్షల హెక్టార్లలో మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 10వేల ఒంటెలను చంపేయాలని డిసైడ్ అయ్యింది.
దీనికి కారణం ఒంటెలు ఎక్కువ నీళ్లు తాగడమే. ప్రస్తుత పరిస్థితుల్లో మంటలు ఆర్పడానికే నీళ్లు లేవు. తీవ్రమైన నీటి కొరత ఉంది. మనుషులు తాగడానికి కూడా నీరు దొరకడం లేదు. ఈ తరుణంలో ఒంటెలకు నీటి సరఫరా చేయడం చాలా కష్టమని అధికారులు చెప్పారు. బాధాకరమైనా.. మరో దారి లేదని.. అందుకే 10వేల ఒంటెలను చంపేయాలని నిర్ణయించామన్నారు. ఇందుకోసం 5 రోజుల క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. బుధవారం(జనవరి 8,2020) నుంచి ఒంటెలను చంపే క్యాంపెయిన్ స్టార్ట్ అయ్యింది. ప్రత్యేక హెలికాప్టర్లలో సిబ్బందిని పంపి మరీ వాటిని చంపేస్తున్నారు.
”ఒంటెలు.. స్థానిక ప్రజలకు పెద్ద సమస్యగా మారాయి. జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఎక్కడ కనిపిస్తే అక్కడ నీరు తాగేస్తున్నాయి. అసలే నీటి కొరత, మంటల వేడి కారణంగా అవస్థలు పడుతున్నాయి. దీనికి తోడు ఒంటెలు మా ఇళ్లను చుట్టుముడుతున్నాయి. ఏసీల నుంచి వచ్చే నీటి కోసం అవి వస్తున్నాయి. ఒంటెలతో ఇబ్బందులు పడుతున్నాము” అని స్థానికులు వాపోయారు. ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వానికి విన్నపం చేశారు. స్పందించిన అధికారులు.. ఒంటెలను చంపేయాలని నిర్ణయించారు.
Also Read : మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టేనా..? : ఇరాన్ దాడులపై ట్రంప్ సంచలన ట్వీట్