Australia
Australia : ప్రేమించిన యువతి మీద మోజు తీరిపోయింది. వదిలించుకోవాలని డిసైడ్ దారుణమైన హత్యకు ప్లాన్ వేసాడు. కేబుల్ టైస్, గాఫర్ టేప్‌తో కట్టేసి సజీవంగా పాతి పెట్టేశాడు. ఇండియాకు చెందిన నర్సింగ్ విద్యార్ధినిని ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి అత్యంత దారుణంగా చంపిన ఘటన సంచలనం రేపింది. 2021 లో ఈ ఘటన జరిగితే రీసెంట్ గా నేరస్థుడు హత్య చేసినట్లు అంగీకరించాడు.
Pakistan : పాక్‌లో పరువు హత్యలు…ఇద్దరు కూతుళ్లను కాల్చిచంపిన తండ్రి
ఇండియాకు చెందిన 21 సంవత్సరాల నర్సింగ్ విద్యార్ధిని జాస్మిన్ కౌర్ ఆస్ట్రేలియాలో ఉంటోంది. అక్కడ తారిక్ జోత్ సింగ్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ఏం జరిగిందో ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు. అందుకోసం దారుణంగా హత్యకు ప్లాన్ చేశాడు. కేబుల్స్ తో బంధించి సజీవంగా పూడ్చి పెట్టాడు. 2021 లో ఈ ఘటన జరిగింది. తాజాగా జరిగిన కోర్టు విచారణలో తాను ఈ హత్య చేసినట్లు తారిక్ జోత్ సింగ్ అంగీకరించాడు. 2021 మార్చిలో కౌర్ ను సింగ్ కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వారి మధ్య బంధం తెగిపోవడంతో ఆమెను హత్య చేయాలని సింగ్ ప్లాన్ చేసినట్లు న్యాయవాదులు తెలిపారు.
సింగ్ కౌర్ ను అడిలైడ్ లోని ఆమె కార్యాలయంలో కిడ్నాప్ చేసి ఆమె కళ్లకు గంతలు కట్టి అవయవాలను కేబుల్ టైస్, గాఫర్ టేప్ తో బంధించి సజీవంగా సమాధి చేశాడట. తమ కుమార్తెను అత్యంత పాశవికంగా హత్య చేసిన సింగ్ ను కఠినంగా శిక్షించాలని కౌర్ కుటుంబ సభ్యులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు.