Malaria Test New Method : సూది గుచ్చకుండానే మలేరియా టెస్టు.. కొత్త పద్ధతిని కనుగొన్న ఆస్ట్రేలియా పరిశోధకులు

సాధారణంగా మలేరియాను రక్తపరీక్ష ద్వారానే గుర్తించవచ్చు. సూదిగుచ్చి మలేరియా టెస్టు చేస్తారు. అయితే, ఒకే చోట ఎక్కువ మందికి లక్షణాలు ఉన్నప్పుడు ఈ పద్ధతిలో వ్యాధి నిర్దారణ చేయడం చాలా ఆలస్యమవుతుంది. కాబట్టి సూదిగుచ్చి వ్యాధిని నిర్ధారణ చేసే టెస్టుకు ఆస్ట్రేలియా పరిశోధకులు చెక్ పెట్టారు.

Malaria Test New Method : సాధారణంగా మలేరియాను రక్తపరీక్ష ద్వారానే గుర్తించవచ్చు. సూదిగుచ్చి మలేరియా టెస్టు చేస్తారు. అయితే, ఒకే చోట ఎక్కువ మందికి లక్షణాలు ఉన్నప్పుడు ఈ పద్ధతిలో వ్యాధి నిర్దారణ చేయడం చాలా ఆలస్యమవుతుంది. కాబట్టి సూదిగుచ్చి వ్యాధిని నిర్ధారణ చేసే టెస్టుకు ఆస్ట్రేలియా పరిశోధకులు చెక్ పెట్టారు. కొత్త పద్ధతిని కనుగొన్నారు. సూది గుచ్చకుండా నిర్వహించే మలేరియా టెస్టును కనుగొన్నారు.

ఈ పద్ధతిలో ఓ పరికరాన్ని ఉపయోగించి వ్యక్తి చెవి లేదా వేలిపై 5-10 సెకన్లపాటు హాని చేయని ప్రకాశించే పరారుణ కాంతి పుంజాన్ని ప్రసంరిజేస్తారు. కంప్యూటర్ అల్గారిథమ్ ఆధారంగా మలేరియాను గుర్తిస్తారు. గ్రామం మొత్తం మలేరియాతో బాధపడుతున్నా ఈ పద్ధతిలో వేగంగా, కచ్చితంగా వ్యాధి నిర్దారణ చేయవచ్చని పరిశోధకులు తెలిపారు. ఈ పరీక్ష రసాయన, సూది రహితమని పేర్కొన్నారు.

Malaria Vaccine : WHO ఆమోదించిన ప్రపంచంలో మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్

చర్మంపై హానికరం కాని ఇన్ ఫ్రారెడ్ లైట్ ను ఫ్లాష్ లాగా ప్రసరింపజేసి మలేరియాను సులువుగా నిర్దారించవచ్చని వెల్లడించారు. దీన్ని స్మార్ట్ ఫోన్ ద్వారా ఆపరేట్ చేయవచ్చని, రిజల్ట్ త్వరగా తెలుస్తుందని చెప్పారు. కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2020లో దాదాపు 24 కోట్ల మందికి పైగా మలేరియాతో బాధపడ్డారు. సుమారు 6 లక్షల మంది మృతి చెందారు.

ట్రెండింగ్ వార్తలు