×
Ad

Austrian Influencer Killed: ఇన్‌ఫ్లుయెన్సర్ దారుణ హత్య.. సూట్ కేసులో డెడ్ బాడీ.. పోలీసుల అదుపులో ఎక్స్ బాయ్‌ఫ్రెండ్..

సడెన్ గా పీపర్ కనిపించకుండా పోయిందని.. అందుబాటులోకి రాలేదని బంధువులు, సహ ఉద్యోగులు తెలిపారు.

Austrian Influencer Killed: ఆస్ట్రియాకు చెందిన బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ స్టెఫానీ పీపర్‌ దారుణ హత్యకు గురైంది. హత్య అనంతరం ఆమె మృతదేహాన్ని సూట్ కేసులో కుక్కి, అడవిలో పాతిపెట్టాడు. స్టెఫానీని హత్య చేసింది మరెవరో కాదు.. ఆమె మాజీ ప్రియుడే. మేకప్, ఫ్యాషన్, సింగింగ్ కంటెంట్‌కు స్టెఫానీ ఫేమస్ అయ్యింది. ఆమె వయసు 31 సంవత్సరాలు.

పోలీసుల కథనం ప్రకారం, నవంబర్ 23న పార్టీ నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత పీపర్ కనిపించకుండా పోయింది. పార్టీ తర్వాత, ఆమె ఒక స్నేహితుడికి తాను సురక్షితంగా ఇంటికి చేరుకున్నానని సందేశం పంపిందని. ఇంతలోనే.. తన మెట్ల దారిలో ఎవరో ఉన్నారని భావిస్తున్నట్లు మరో సందేశం పంపిందని పోలీసులు తెలిపారు.

కాగా, పీపర్ ఉంటున్న ఇంట్లో ఆమె మాజీ ప్రియుడిని తాము చూశామని పీపర్ ఇంటికి చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారు పోలీసులతో చెప్పారు. సడెన్ గా పీపర్ కనిపించకుండా పోయిందని.. అందుబాటులోకి రాలేదని బంధువులు, సహ ఉద్యోగులు తెలిపారు. ఆమె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పీపర్ మాజీ ప్రియుడిని స్లోవేనియాలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తి తన కారులో స్లోవేనియాకు అనేకసార్లు ప్రయాణించినట్లు భావిస్తున్నట్లు స్టైరియన్ రాష్ట్ర పోలీసులు తెలిపారు. నవంబర్ 24న ఆస్ట్రియన్-స్లోవేనియన్ సరిహద్దు సమీపంలోని ఒక క్యాసినో పార్కింగ్ స్థలంలో ఒక కారు మంటల్లో చిక్కుకుందని పోలీసులు వెల్లడించారు.

పోలీసుల విచారణలో పీపర్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నేరాన్ని అంగీకరించాడు. గొంతు కోసి పీపర్ ను హత్య చేశానని, మృతదేహాన్ని సూట్‌కేస్‌లో దాచి స్లోవేనియన్ అడవిలో పాతి పెట్టినట్లు అతడు అంగీకరించాడని పోలీసులు వెల్లడించారు.

Also Read: ఇంగ్లాండ్‌లో కత్తిపోటుకు గురై మృతి చెందిన భారత విద్యార్థి విజయ్ ఎవరు?