ఇంగ్లాండ్‌లో కత్తిపోటుకు గురై మృతి చెందిన భారత విద్యార్థి విజయ్ ఎవరు?

ఈ ఏడాది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్‌లో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అనంతరం అతను ఉన్నత చదువుల కోసం యునైటెడ్ కింగ్డమ్ వెళ్లాడు.

ఇంగ్లాండ్‌లో కత్తిపోటుకు గురై మృతి చెందిన భారత విద్యార్థి విజయ్ ఎవరు?

Vijay Sheoran

Updated On : December 1, 2025 / 3:34 PM IST

Vijay Sheoran: ఇంగ్లాండ్‌లో కత్తిపోటుకు గురై విజయ్ శెయోరన్ (30) అనే భారత విద్యార్థి మృతి చెందాడు. నవంబర్ 25న వోర్సెస్టర్‌లో రోడ్డులో అతడిని కొందరు కత్తితో పొడించి చంపేశారు. బార్బోర్న్ రోడ్‌లో నవంబర్ 27 ఉదయం తీవ్ర గాయాలతో కనిపించిన విజయ్ శెయోరన్‌ను ఆసుపత్రికి తీసుకువెళ్లినా లాభం లేకుండాపోయింది. చికిత్స పొందుతూ ప్రాణం కోల్పోయాడు.

విజయ్ హత్య కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. విచారణ కొనసాగుతున్నప్పటికీ వారిని బెయిల్‌పై విడుదల చేశారు. డిటెక్టివ్ చీఫ్ ఇన్స్‌పెక్టర్ లీ హోల్హౌస్ బాధితుడి కుటుంబానికి సంతాపం తెలిపారు. ఈ దాడి గురించి ఎవరి వద్దయినా సమాచారం, వీడియోలు ఉంటే తమకు చెప్పాలని ఆయన కోరారు. విచారణ కొనసాగుతోందని తెలిపారు. (Vijay Sheoran)

పార్లమెంట్‌కు కుక్కను తీసుకొచ్చిన ఎంపీ రేణుకా చౌదరి.. కరిచేవాళ్లు మాత్రం పార్లమెంట్‌ లోపల కూర్చున్నారంటూ..

విజయ్ కుమార్ శెయోరన్ ఎవరు?
విజయ్ కుమార్ శెయోరన్ హరియాణాలోని చార్ఖీ దాద్రీ జిల్లాలోని జగ్రమ్బాస్ గ్రామానికి చెందినవాడు. ఈ ఏడాది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్‌లో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అనంతరం అతను ఉన్నత చదువుల కోసం యునైటెడ్ కింగ్డమ్ వెళ్లాడు.

శెయోరన్ బ్రిస్టల్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ది వెస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో చదువుతున్నాడు. అతనికి ఒక అన్న ఉన్నాడు. పూర్తి విచారణ జరగాలని ఆయన దౌత్యాధికారుల జోక్యాన్ఇన కోరాడు. విదేశాంగ మంత్రి జయశంకర్‌కి రాసిన లేఖ రాసి, తన సోదరుడిన మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడంలో సాయం చేయాలని రవి కుమార్ కోరాడు.

ఈ విషయంలో తమ కుటుంబం విదేశీ విధానాలు, చట్టపరమైన ప్రక్రియలు, పత్రాల సమర్పించడం, ఆర్థిక అంశాలతో ఇబ్బంది పడుతోందని అన్నాడు. యూకేలోని భారత హై కమిషన్ వెంటనే సాయం అందించేందుకు ఆదేశాలు ఇవ్వాలని, అవసరమైన పత్రాలు, అధికారులతో సమన్వయం, రవాణా సౌకర్యం కోసం సపోర్ట్‌ కోరాడు.

హరియాణా ఎమ్మెల్యే స్పందన
శెయోరన్ హత్యపై బీజేపీ ఎమ్మెల్యే సునీల్ సత్పాల్ సంగ్వాన్ స్పందిస్తూ.. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి పూర్తిగా సహాయం అందించాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ముఖ్యంగా మృతదేహాన్ని త్వరగా తీసుకురావడంలో సాయం చేయాలని అన్నారు.