Viral Video: అమెరికాలో అక్రమ వలసదారులను అరికట్టే క్రమంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఓ వ్యక్తిని అరెస్టు చేసేందుకు వారు తలుపు పగలగొట్టగా ఆ రూమ్‌లో ఓ చిన్నారి ఏడ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) ఏజెంట్లు బలవంతంగా గదిలోకి ప్రవేశించిన దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. గది తలుపులు పగులగొట్టిన అధికారులు తుపాకులు చూపించడంతో ఆ సమయంలో అందులోని ఓ మహిళ, ఇద్దరు పురుషులు షాక్‌కు గురయ్యారు. ఆ సమయంలోనే ఓ చిన్నారి ఏడుపు స్పష్టంగా వినిపించింది.
గది తలుపులు పగులగొట్టిన ఐసీఈ అధికారులు.. “మేము పోలీసులం, కదలవద్దు, చేతులు పైకి ఎత్తండి” అంటూ గట్టిగా అరుస్తూ, లోపల ఉన్న వారికి తుపాకులతో గురిపెట్టారు.ఒక ఎక్స్ యూజర్ ఈ వీడియోను షేర్ చేస్తూ.. “ఐసీఈ అధికారులు పోర్ట్‌ల్యాండ్ (ఒరెగాన్)లో తలుపు తన్ని లోపలికి చొరబడి ఇద్దరిని అరెస్టు చేశారు.
హోంల్యాండ్ సెక్యూరిటీ ఉన్నతాధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ఐసీఈ అధికారులు అక్రమ వలసదారుని ఆపేందుకు ప్రయత్నించగా అతను అరెస్టు తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఆ గదిలో ఒక మహిళ, 3 నెలల శిశువు కూడా ఉన్నారు” అని రాశాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. యూజర్లు విమర్శలు చేస్తున్నారు. “పిల్లలను ఇలాంటి పరిస్థితుల్లోకి నెట్టివేయడం సిగ్గుచేటు” అని ఓ యూజర్ కామెంట్ చేశారు.
JUST IN: ICE agents kick in a door and burst into a room before making two arrests in Portland, Oregon.
According to a senior Department of Homeland Security official, ICE officers tried pulling an illegal immigrant over before he tried to evade arrest.
“He attempted to evade… pic.twitter.com/qOTvuVQ0P0
— Collin Rugg (@CollinRugg) October 17, 2025