ఐసిస్ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీని హతామార్చిన ‘ఆపరేషన్ బాగ్దాదీ’ వీడియోను అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ బుధవారం (అక్టోబర్ 30)న రిలీజ్ చేసింది. మీడియా సమావేశంలో పెంటగాన్ బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ఉన్న ఈ వీడియోను రిలీజ్ చేసింది. సిరియాలోని ఇదిల్బీ ప్రాంతంలోని బాగ్దాదీ అబు బకర్ అల్ ఇంటిపై అమెరికా సైన్యం వైమానిక దాడులు జరిపింది.
ఈ సందర్భంగా అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ కెన్నెత్ మెకంజీ మాట్లాడుతూ..పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. తమ నుంచి తప్పించుకునే క్రమంలో అబు బకర్ ఓ సొరంగంలో దాక్కున్నాడనీ..అతనితో పాటు అతని 12 సంవత్సరాలు వయస్సున్న ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారనీ తెలిపారు.
అమెరికా బలగాలపైకి బాగ్దాదీ కాల్పులకు పాల్పడిన క్రమంలో అతను చివరికి తనను తాను పేల్చుకున్నాడన్నారు. ఈ పేలుడులో అతనితో పాటు ఉన్న ఆ ఇద్దరు చిన్నారులు కూడా చనిపోయారరని మెకంజీ తెలిపారు. బాగ్దాదీ చనిపోయిన అనంతరం ఆ ఇంటిని పూర్తిగా నేలమట్టం చేశామని కెన్నెత్ మెకంజీ తెలిపారు. చనిపోయేముందు అబు బకర్ అల్ ఏడ్చాడని కూడా తెలిపారు.
US military confirms al-Baghdadi was buried at sea; releases video, photo of Syria raid
Read @ANI Story | https://t.co/vI4lMjPhAB pic.twitter.com/YY0bvJCX5A
— ANI Digital (@ani_digital) October 30, 2019
LATEST — Pentagon shares video showing moments when Daesh’s terrorist leader Al-Baghdadi blew himself up after realizing he was cornered pic.twitter.com/WedN28IaVs
— DAILY SABAH (@DailySabah) October 30, 2019
Footage of U.S SOF raid on Baghdadi's compound disclosed at Pentagon press briefing: https://t.co/UvX9B8hoyjpic.twitter.com/6qy4s7kmt3
— Harry Boone (@towersight) October 30, 2019