బట్టతలని బాధపడకండి.. అమ్మాయిలను ఆకర్షించే సెక్సీలు మీరే!

  • Publish Date - January 7, 2020 / 10:13 AM IST

ప్రస్తుత రోజుల్లో చాలామంది మగాళ్లను వేధించే సమస్య.. బట్టతల. చిన్న వయస్సులోనే తలపై జుట్టంతా ఊడిపోవడంతో తెగ వర్రీ అవుతుంటారు. నలుగురిలో తిరగడానికి సంకోచిస్తుంటారు. వేలకు వేలు డబ్బులు పోసి హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్లు చేయించుకునేవారు లేకపోలేదు. ఇలాంటి ట్రీట్ మెంట్లతో తలపై జుట్టు పెరగడం పక్కన బెడితే దీని కారణంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్ ప్రాణాలకే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందని మరిచిపోతుంటారు.

క్లీన్ సేవ్.. ఎంతో బెటర్ :
వయస్సు పెరుగుతున్నా కొద్ది చాలామందిలో బట్టతల కనిపిస్తుంటుంది. ముఖ్యంగా 35 ఏళ్ల యువకుల్లో 66 శాతానికి పైగా ఈ హెయిర్ లాస్ సమస్య అధికంగా కనిపిస్తోంది. కారణం.. ఆహారపు అలవాట్లు కావొచ్చు.. వారి జీవనశైలి కూడా ప్రధాన కారణంగా చెప్పవచ్చు. దీంతో హెయిర్ లాస్ 55శాత నుంచి 85శాతానికి పైగా పెరిగిపోతోంది.

కానీ, అదే బట్టతలను వరంగా మార్చుకునేవారు ఎంతోమంది ఉన్నారు. బట్ట తల వచ్చిందని బాధపడుతూ కూర్చొనే కంటే ఉన్న జుట్టునే క్లీన్ గా సేవ్ చేసుకుని అదే ట్రెండ్ అనే వారు ఎందరో ఉన్నారు. తలపై ఒత్తుగా జుట్టు ఉన్నవారంతా దగ్గరికి కట్ చేసి అదే స్టయిల్ అంటుంటే.. బట్టతల ఉన్నవారంతా ఎందుకు వర్రీ కావడం అంటున్నారు పలువురు విశ్లేషకులు.

హాలీవుడ్ నటుల్లో ఇదే ట్రెండ్ :
నిజానికి పాశ్యాత్య దేశాల్లో బట్టతలతో మెరిసే ఎందరో సెలబ్రిటీలు హుందాగా జీవిస్తున్నారు. అదే ఫ్యాషన్ గా ట్రెండ్ అవుతున్నారు. పలచగా ఉండే జుట్టును ఉంచుకుని బాధపడే కంటే.. హెడ్ క్లీన్ సేవ్ చేసుకోవడం ఉత్తమంగా ఫీల్ అవుతున్నారు. తలపై ఒత్తుగా జట్టుతో ఉన్న మగాళ్ల కంటే నున్నటి గుండుతో మిళమిళాలాడే బాల్డ్ హెడ్ కలిగిన వారే ఎంతో సెక్సీగా కనిపిస్తారని ఫ్లోరిడాలోని బారే యూనివర్శిటీ నుంచి ఫ్రాంక్ మస్ క్యారెల్లా చెబుతున్నారు.

పురుషుల్లో బట్టతలపై జరిపిన తన అధ్యయనంలో ఆయన ఎన్నో విషయాలను వెల్లడించారు. నాలుగు విభిన్న రంగాలకు చెందిన కొంతమంది పురుషులపై కారెల్లా తన బృందంతో కలిసి అధ్యయనం చేశారు. భౌతిక ఆకర్షణ, దూకుడు స్వభావం, తృప్తిపరచడం, సామాజిక పరిపక్వతతో పాటు నిజాయితీ, వివేకం, సామాజిక హోదా వంటి అంశాలపై అధ్యయనం చేశారు.

వీరిలో తలపై జుట్టు ఎక్కువగా ఉన్నవారికంటే బట్టతల కలిగినవారే ఎక్కువ సంఖ్యలో నిజాయితీ, వివేకం, బలమైన వారిగా గుర్తించినట్టు తెలిపారు. వీరిలో దాదాపు అన్ని అంశాలు బాగానే ఉన్నాయని పేర్కొంది. కానీ, వీరిలో ఒక అంశం ఇబ్బంది పెట్టేదిగా కనిపిస్తోంది. తమ బట్టతలపై తాకడం ద్వారా భౌతిక ఆకర్షణను వారిలో తగ్గిస్తుందని అధ్యయనం తెలిపింది.

అమ్మాయిలను ఆకర్షించేది మీరే :
అదే.. హాలీవుడ్ నటుల్లో ఒకరైన జాసన్ స్టాథామ్ చూస్తే ఎంతో సెక్సీగా కనిపిస్తారు. బట్టతల అయినప్పటికీ ఎంతో హుందాగా ఆకర్షణీయంగా ఉంటారు. పైగా అతడు రోజీ హంటింగ్టన్ వైట్లీతో డేటింగ్ చేస్తున్నాడు కూడా.. వాట్ ఏ గాయ్ అనకుండా ఉండలేరు. బట్టతల పెరిగే కొద్ది చాలామందిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. భౌతిక ఆకర్షణ కూడా తగ్గిపోయి మరింత నిరుత్సాహానికి గురవుతారు. కానీ, జాసన్ విషయానికి వస్తే మాత్రం అతడి సోషల్ డామినెన్స్‌ను పెంచుతోందని మ్యూస్కేరిల్లా తెలిపారు.

 

డోంట్ ఫీల్..రీమూవ్ హెయిర్ :
పురుషుల్లో బట్టతల కారణంగా వారికి సమాజంలో ఆధిపత్యానికి ముప్పు ఉందని ఎక్కడా లేదని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. బట్టతల కలిగిన మగాళ్లే ఎక్కువగా మహిళలను ఆకర్షిస్తారని చెబుతున్నాయి. మీరు కూడా బట్టతల వచ్చిందని ఆందోళన చెందకండి. తలపై జుట్టు లేకుంటే సిగ్గుగా ఫీల్ అవ్వకండి.. జుట్టు లేకపోయినా సరే ఎవరైనా సరే ఈజీగా ఎట్రాక్ట్ చేయగలరని తెలుసుకోండి. ఎంతమందిలో ఉన్నా సరే మీకుంటూ ప్రత్యేక గుర్తింపును కూడా పొందుతారు. జుట్టు ఊడిపోతుందనే ఆందోళన పక్కన పెట్టేసి.. క్లీన్ హెడ్ సేవ్ తో అందరిని ఆకర్షించే ప్రయత్నం చేయండి..

ట్రెండింగ్ వార్తలు