Dhaka: ఢాకాలోని భారత రాయబార కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారత రాయబార కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని బంగ్లాదేశ్ కు చెందిన ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ బృందం దాడికి యత్నించింది. జూలై 2024లో బంగ్లాదేశ్‌లో జరిగిన తిరుగుబాటుతో సంబంధం ఉన్న ఒక బృందానికి చెందిన నిరసనకారులు ఢాకాలోని భారత హైకమిషన్ వైపునకు చొచ్చుకెళ్లారు. అదే సమయంలో అక్కడ పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఇక, ఇటీవలి కాలంలో భారత్ కు, భారతీయ దౌత్యవేత్తలకు బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఇప్పుడు భారత రాయబార కార్యాలయం బయట రచ్చ చేయడం దుమారం రేపింది. బెదిరింపుల అంశంపై భారత్ సీరియస్ అయ్యింది. బంగ్లాదేశ్ హైకమిషనర్‌ను పిలిపించి భద్రతాపరమైన ఆందోళనలను వ్యక్తం చేసింది. ఈరోజు ఉదయం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారత్ లోని బంగ్లాదేశ్ హై కమిషనర్ రియాజ్ హమీదుల్లాతో మాట్లాడింది. బంగ్లాదేశ్‌లో క్షీణిస్తున్న భద్రతా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది.
జూలై హింసలో పాల్గొన్న ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ ఢాకాలోని భారత హైకమిషన్ వెలుపల బారికేడ్లపై దాడి చేసిన దృశ్యాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గత కొన్ని రోజులుగా భారత దౌత్యవేత్తలకు బెదిరింపులు వస్తున్నాయి.
Shocking visuals from Bangladesh as the Islamic extremist group involved in the July violence has marched and attacked barricades outside the Indian High Commission in Dhaka.
For the past several days, threats have been received against India and Indian diplomats pic.twitter.com/LpwP6ahkam
— Megh Updates 🚨™ (@MeghUpdates) December 17, 2025