మాస్క్ ధరించనవసరం లేదు…చైనా సంచలన నిర్ణయం

ఓ వైపు ప్రపంచ దేశాలన్ని కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి మాస్క్‌ ధరించడం తప్పనిసరి అంటుండగా.. డ్రాగన్‌ దేశం మాత్రం ఇక మాస్క్‌ ధరించాల్సిన అవసరం లేదంటుంది. ఇక మీదట బీజింగ్‌ ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించాల్సిన అవసరం లేదని చైనా ఆరోగ్య శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వరుసగా 13 రోజులుగా ఇక్కడ ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.



కానీ, సామాజిక ఒత్తిడి, సురక్షితను దృష్టిలో పెట్టుకుని మాస్క్‌ ధరిచండానికే ప్రజలు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో ఓ మహిళ మాట్లాడుతూ.. మాస్క్‌ తీసేయ్యాలని అనుకుంటాను. కానీ ఇతరులు దీన్ని అంగీకరిస్తారో లేదో తెలియదు. నేను మాస్క్‌ తీసేసి తిరిగితే నా పక్క వారు భయాందోళనలకు గురవుతారు. అందుకే మాస్క్‌ తీసేయడం లేదు’ అన్నారు.



మాస్క్‌ ధరించడం, హోం క్వారంటైన్‌, టెస్టింగ్‌లో పాల్గొనడం వంటి నియమాలను కఠినంగా అమలు చేయడం వల్లనే ఈ వ్యాధిని నియంత్రించడంలో చైనా విజయవంతం అయ్యిందంటున్నారు నిపుణులు.