Belgian shepherd Dogs climbing tree and snatching fruit
Belgian Shepherds Climbing Tree : సాధారణంగా కోతులు చిలిపి పనులు చేస్తు అలరిస్తుంటాయి. కానీ కొన్ని కుక్కలు చేసిన పని భలే ఆకట్టుకుంటోంది. ఈ రెండు కుక్కలు ఓ చెట్టుపైకి ఎగిరి గాల్లోకి ఎగిరి మరీ జంప్ చేస్తున్నాయి. అవి దూకే విధానం చూస్తే ఇవి కుక్కలా? లేక ప్రొఫెషనల్ అథ్లెట్లలా? అనిపిస్తోంది. అంత ఎత్తున ఉన్న పండును అందుకోవడానికి కుక్కలు స్పీడుగా పరుగెడుతూ కాండం మీద నుంచి చెట్టు పైదాకా వెళ్లి అక్కడి నుంచి అలాగే గాల్లోకి ఎగురుతూ.. పండును అందుకోవడానికి అవి చేసిన ప్రయత్నాలు నెటిజన్లును విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఓ పెద్ద చెట్టుకు పసుపు రంగులో ఉండే పండుపై రెండు బెల్జియం షెపర్డ్ జాతికి చెందిన శునకాల కన్ను పడింది. దాన్ని అందుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. జంపింగ్ లో తెగ ట్రై చేస్తున్నాయి. వేగంగా పరుగెడుతూ చెట్టు కాండంపై పైదాకా చేరుకుని.. అక్కడి నుంచి గాల్లోకి ఎగిరి పండు అందుకునేందుకు ప్రయత్నిస్తూ కిందికి దూకడం మొదలుపెట్టాయి. ఒకదాని వెనుక మరో శునకం ప్రయత్నించగా.. వాటిలోని ఓ శునకం పండును అందుకుని కిందికి దూకింది. వెంటనే మరో శునకం దాని దగ్గరికి చేరింది. రెండు ఆ పండును లాక్కుంటూ పొలాల్లోకి పరుగెత్తాయి.
ఈ వీడియోపై నెటిజన్లు వ్యూస్..లైక్స్ ల వర్షం కురిపిస్తున్నారు. ఏకంగా లక్షలాది వ్యూస్ తో తెగ వైరల్ అవుతోంది. మొరిస్సా ష్వార్జ్ అనే పేరిట ఉన్న ట్విట్టర్ ఖాతాలో దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ‘ఇవి మంచి క్రీడాకారులు (అథ్లెట్లు)’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో కేవలం 11 సెకన్లే ఉన్నా..భలే వైరల్ అవుతోంది.
They’re athletes!!! ? pic.twitter.com/aA8vJGq4Ze
— Morissa Schwartz (Dr. Rissy) (@MorissaSchwartz) August 19, 2022