Nobel Prize 2022: బ్యాంకులు, ఆర్థిక సంక్షోభంపై పరిశోధన.. ముగ్గురికి ఉమ్మడిగా నోబెల్

కార్మిక ఆర్థిక శాస్త్రానికి అనుభావిక సహకారంపై పరిశోధన చేసిన డేవిడ్ కార్డ్‌కు సగం బహుమతి ఇవ్వగా, మిగతా సగాన్ని జోషువా డి.అంగ్రిస్ట్, గుడియో డబ్ల్యూ. ఇంబెన్స్‌లకు సంయుక్తంగా అందజేశారు. కాగా, నోబెల్ శాంతి బహుమతిని బెలారస్, రష్యా, ఉక్రెయిన్‌కు చెందిన హక్కుల ప్రచారకర్తలు అలెస్ బియాలిట్‌స్కీతోపాటు రష్యాకు చెందిన హక్కుల సంస్థ మెమోరియల్, ఉక్రెయిన్‌కు చెందిన హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్‌కు దక్కింది.

Ben Bernanke, Douglas Diamond, Philip Dybvig win 2022 Nobel Prize in Economics

Nobel Prize 2022: ఆర్థిక సంక్షోభం, బ్యాకుంల పాత్రపై చేసిన పరిశోధనకు గాను ఈ ఏడాది ముగ్గురికి ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి లభించింది. బెన్ ఎస్ బెర్నాన్కే, డగ్లస్ అడ్ల్యూ డైమండ్, ఫిలిప్ హెచ్ డిబ్‌విగ్‌ అనే ముగ్గురిని ఈ బహుమతి వరించింది. కాగా, ఈ ముగ్గురు ఆర్థిక వ్యవస్థలో, మరీ ముఖ్యంగా ఆర్థిక సంక్షోభాల సమయంలో బ్యాంకుల పాత్రపై మన అవగాహనను గణనీయంగా మెరుగుపరిచారని, బ్యాంకులు కుప్పకూలిపోకుండా నివారించడం అవసరమనేది వారి పరిశోధనలో ముఖ్యమైన అంశమని నోబెల్ కమిటీ పేర్కొంది.

సంక్షోభ సమయంలో అవి బలహీనంగా మారకుండా ఏం చేయాలి? బ్యాంకుల పతనాన్ని నివారించడం ఎందుకు ముఖ్యం? బ్యాంకు పతనాలు ఆర్థిక సంక్షోభానికి ఎలా కారణం అవుతాయి? మనకు బ్యాంకులు ఎందుకున్నాయి? అన్న విషయం ఆధునిక బ్యాంకింగ్ పరిశోధనలో స్పష్టమైందని నోబెల్ కమిటీ పేర్కొంది. 1980ల మొదట్లో బెన్ బెర్నాన్కే, డగ్లస్ డమైండ్, ఫిలిప్ డిబ్‌విగ్‌లు ఈ పరిశోధనకు పునాదులు వేశారని కమిటీ తెలిపింది. వారి విశ్లేషణలు ఆర్థిక మార్కెట్లను నియంత్రించడంలో, ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కోవడంలో ఆచరణాత్మక ప్రాముఖ్యత కలిగి ఉందని కమిటీ వివరించింది.

The Nobel Peace Prize 2022: బెలారూస్ మానవ హక్కుల కార్యకర్తతో పాటు మరో 2 సంస్థలకు సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి

ఆర్థిక మార్కెట్లను నియంత్రించడంలో, ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కోవడంలో వారి విశ్లేషణలు ఆచరణాత్మక ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయి. డిపాజిట్లు, డిపాజిట్ ఇన్సూరెన్స్‭లు, బ్యాంకు రుణాల విషయంలో డైమండ్, డైబ్‭విగ్ పరిశోధనలు బ్యాంకులకు ఎంతో మేలు చేశాయి. పురస్కార గ్రహీతల విశ్లేషణలు.. తీవ్రమైన ఆర్థిక సంక్షోభాలు, బెయిల్ అవుట్లనునివారించగల సామర్థ్యాన్ని మెరుగు పర్చాయని నోబెల్ ప్రైజ్ కమిటీ పేర్కొంది. గతేడాది కూడా ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ ముగ్గురిని.. డేవిడ్ కార్డ్, జోషువా డి అంగ్రిస్ట్, గుయిడో డబ్ల్యూ ఇంబెన్స్‌లకు దక్కింది.

కార్మిక ఆర్థిక శాస్త్రానికి అనుభావిక సహకారంపై పరిశోధన చేసిన డేవిడ్ కార్డ్‌కు సగం బహుమతి ఇవ్వగా, మిగతా సగాన్ని జోషువా డి.అంగ్రిస్ట్, గుడియో డబ్ల్యూ. ఇంబెన్స్‌లకు సంయుక్తంగా అందజేశారు. కాగా, నోబెల్ శాంతి బహుమతిని బెలారస్, రష్యా, ఉక్రెయిన్‌కు చెందిన హక్కుల ప్రచారకర్తలు అలెస్ బియాలిట్‌స్కీతోపాటు రష్యాకు చెందిన హక్కుల సంస్థ మెమోరియల్, ఉక్రెయిన్‌కు చెందిన హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్‌కు దక్కింది.

Nobel Prize 2022: రసాయన శాస్త్రంలో పరిశోధనకి గాను ముగ్గురికి నోబెల్

ట్రెండింగ్ వార్తలు