Nobel Prize 2022: రసాయన శాస్త్రంలో పరిశోధనకి గాను ముగ్గురికి నోబెల్

అమెరికన్స్ కెరోలిన్ బెర్టోజ్జి, బారీ షార్‌ప్‌లెస్ , డెన్మార్క్‌కు చెందిన మోర్టెన్ మెల్డాల్‌ లకు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి ఇస్తున్నట్లు జ్యూరీ ప్రకటించింది. పరమాణువు నిర్మాణంలో నూతన విధానమైన ఆర్గానోక్యాటలసిస్‌ అభివృద్ధి చేసినందుకు గాను 2021లో బెంజిమిన్‌ లిస్ట్‌, డేవిడ్‌ మెక్‌మిల్లన్‌లకు ఈ అవార్డు దక్కింది. రసాయన శాస్త్రాన్ని పర్యావరణహితంగా మార్చిన ఆ విధానం మానవాళికి ఎంతో ఉపయుక్తంగా ఉందని సెలక్షన్‌ కమిటీ అభిప్రాయపడింది.

Nobel Prize 2022: రసాయన శాస్త్రంలో పరిశోధనకి గాను ముగ్గురికి నోబెల్

The 2022 chemistry Nobel prize goes to bioorthogonal and click chemistry

Nobel Prize 2022: రసాయన శాస్త్రంలో జరిపిన విశేష పరిశోధనలలకు గాను ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్‌ బహుమతి లభించింది. క్లిక్‌ కెమిస్ట్రీతోపాటు బయో ఆర్థోగోనల్‌ కెమిస్ట్రీలను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు కరోలిన్‌ ఆర్‌ బెర్టోజీ, మార్టెన్‌ మెల్డల్‌, కే బ్యారీ షార్ప్‌లెస్‌లను ఈ ఏడాది నోబెల్‌ పురస్కారానికి ఎంపిక చేసినట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ తాజాగా వెల్లడించింది. వీరు అమెరికా, డెన్మార్క్‌లకు చెందినవారు. గతేడాది రసాయన శాస్త్రంలో నోబెల్‌ అవార్డుకు ఇద్దరు ఎంపికకాగా ఈసారి ముగ్గురు విజేతలుగా నిలిచారు.

అమెరికన్స్ కెరోలిన్ బెర్టోజ్జి, బారీ షార్‌ప్‌లెస్ , డెన్మార్క్‌కు చెందిన మోర్టెన్ మెల్డాల్‌ లకు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి ఇస్తున్నట్లు జ్యూరీ ప్రకటించింది. పరమాణువు నిర్మాణంలో నూతన విధానమైన ఆర్గానోక్యాటలసిస్‌ అభివృద్ధి చేసినందుకు గాను 2021లో బెంజిమిన్‌ లిస్ట్‌, డేవిడ్‌ మెక్‌మిల్లన్‌లకు ఈ అవార్డు దక్కింది. రసాయన శాస్త్రాన్ని పర్యావరణహితంగా మార్చిన ఆ విధానం మానవాళికి ఎంతో ఉపయుక్తంగా ఉందని సెలక్షన్‌ కమిటీ అభిప్రాయపడింది.

ఇక ఈ ఏడాది మరో విశేషమేంటంటే.. నోబెల్ పురస్కారానికి ఎంపికైనన జాబితాలో ఉన్న బ్యారీ షార్ప్‌లెస్ రెండుసార్లు నోబెల్‌ బహుమతి అందుకున్న ఐదో వ్యక్తిగా ఘనత సాధించనున్నారు. 2001లో బ్యారీ షార్ప్‌లెస్‌ ఒకసారి నోబెల్‌ పురస్కారం పొందగా ఈ ఏడాది రెండోది అందుకోనున్నారు. ఇప్పటివరకు నోబెల్‌ బహుమతులను జాన్‌ బర్డీన్‌, మేరీ స్ల్కోదోవ్‌స్కా క్యూరీ, లైనస్‌ పాలింగ్‌, ఫ్రెడెరిక్‌ సాంగర్‌లు రెండుసార్లు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును స్వీకరించారు. బారీ షార్‌ప్‌లెస్‌ (81)కు 2001లోనూ, 2022లోనూ రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ బహుమతులను ఇస్తోంది.

Jammu Kashmir: పాకిస్తాన్‭తో శాంతి చర్చలపై అమిత్ షా ఏమన్నారంటే?