US-China tensions: జిన్‭పింగ్‭ను నియంత అంటూ విరుచుకుపడ్డ బైడెన్.. ఏం రెచ్చగొడుతున్నారా అంటూ అదే స్థాయిలో దాడికి దిగిన చైనా

అమెరికా అగ్రశ్రేణి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్, చైనా పర్యటనలో భాగంగా జిన్‭పింగ్‭ను కలిశారు. ఇది జరిగిన ఒక రోజు అనంతరం బైడెన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమెరికా గగనతలంలో అనుమానాస్పద చైనీస్ గూఢచారి బెలూన్ ఎగిరిపోయినప్పుడు జిన్‭పింగ్ చాలా ఇబ్బందిపడ్డారంటూ ఎద్దేవా చేశారు.

China vs USA: చైనా అధ్యక్షుడు జీ జిన్‭పింగ్‭పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విరుచుకుపడ్డారు. ఆయనను నియంత అంటూ విమర్శలు గుప్పించారు. అమెరికాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన ప్రారంభమైన తొలిరోజే బైడెన్ ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తిని రేపుతున్నాయి. మంగళవారం ఓ కార్యక్రమంలో బైడెన్ మాట్లాడుతూ జిన్‭పింగ్‭ నియంత అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే బైడెన్ విమర్శలకు జిన్‭పింగ్‭ గట్టిగానే బదులు ఇచ్చారు. రాజకీయంగా రెచ్చగొడుతున్నారా? అంటూ అదే స్థాయిలో బైడెన్‭పై బుధవారం చైనా‭ ప్రతిదాడి చేసింది.

JC Prabhakar Reddy: ఎమ్మెల్యే.. నీపని నువ్వు చేసుకో.. ఆ విషయంలో జోక్యం చేసుకుంటే ఖబడ్దార్

నిజానికి అమెరికా అగ్రశ్రేణి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్, చైనా పర్యటనలో భాగంగా జిన్‭పింగ్‭ను కలిశారు. ఇది జరిగిన ఒక రోజు అనంతరం బైడెన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాలిఫోర్నియాలో జరిగిన నిధుల సమీకరణకు హాజరైన బైడెన్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమెరికా గగనతలంలో అనుమానాస్పద చైనీస్ గూఢచారి బెలూన్ ఎగిరిపోయినప్పుడు జిన్‭పింగ్ చాలా ఇబ్బందిపడ్డారంటూ ఎద్దేవా చేశారు. “నేను ఆ బెలూన్‌ను రెండు బాక్స్ కార్ల నిండా గూఢచారి పరికరాలతో కాల్చినప్పుడు జిన్‌పింగ్ చాలా కలత చెంది ఉంటారు” బిడెన్ అన్నారు.

Pawan Kalyan Vs YCP : పవన్ కల్యాణ్ వర్సెస్ వైసీపీ కాపు లీడర్స్.. ఏపీ రాజకీయాల్లో పెరిగిన హీట్

‘‘ఇది నియంతలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏం జరిగిందో వారికి తెలియనప్పుడు, అది దారి తప్పిందని అనుకుంటారు. కానీ అది లేదని వాళ్లు తెలుసుకోవాలి” అని బైడెన్ అన్నారు. జిన్‭పింగ్‭ ఈ ఏడాది మార్చిలో మూడవసారి చైనా అధ్యక్షుడిగా నియామకమయ్యారు. అంతకు ముందు అక్టోబర్‌లో కమ్యూనిస్ట్ పార్టీ అధినేతగా మరోసారి ఎన్నికయ్యారు. దీంతో చైనాలో మావో జెడాంగ్ తర్వాత అత్యంత శక్తివంతమైన నాయకుడిగా అవతరించారు.

Maharashtra Politics: ఈపాటికి సీఎం షిండే ఆత్మహత్య చేసుకునేవారు.. మహా విద్యామంత్రి సంచలన వ్యాఖ్యలు

కాగా బైడెన్ వ్యాఖ్యలు అత్యంత అసంబద్ధమైనవని, బాధ్యతారహితమైనవని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. బైడెన్ వ్యాఖ్యలు వాస్తవాల్ని దౌత్యపరమైన నియమాల్ని చైనా రాజకీయ గౌరవాన్ని తీవ్రంగా ఉల్లంఘించాయని మండిపడ్డారు. బైడెన్ వ్యాఖ్యలు రాజకీయంగా రెచ్చగొట్టేవని విమర్శించారు. బైడెన్ నోరు వదులుగా ఉండే ఫిరంగని దుయ్యబట్టారు. అమెరికా గగనతలంపై చైనా బెలూన్ వెళ్లడం అనాలోచితమని మావో అన్నారు. ‘‘పరస్పర విశ్వాసాన్ని చైనా నొక్కి చెబుతోంది. దైత్య నియమాల్ని అంగీకరించాలి. కానీ బైడెన్ వ్యాఖ్యలు చాలా విధ్వంసకరం, హానికరమైనవి” అని మావో అన్నారు.

ట్రెండింగ్ వార్తలు