Starship Explodes: బాబోయ్.. పేలిపోయిన స్పేస్ ఎక్స్ స్టార్ షిప్.. ఫైర్ టెస్ట్ సమయంలో ఊహించని ఘటన

ఇటీవలి కాలంలో స్పేస్ ఎక్స్ కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. సుదూర అంతరిక్ష యాత్రల కోసం రూపొందించిన స్టార్ షిప్ మెగా రాకెట్ ఇప్పటికే మూడుసార్లు విఫలమైంది.

Starship Explodes: ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ తయారు చేసిన స్టార్‌ షిప్‌ పేలిపోయింది. ఫైర్ టెస్ట్ సమయంలో ఈ ఘటన జరిగింది. టెక్సాస్‌లోని పరీక్షా కేంద్రం వద్ద స్టార్ షిప్ ను పరీక్షించేందుకు ఉంచారు. పరిశీలన దశలోనే అది పేలిపోయింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అక్కడ భారీ శబ్దం వచ్చింది.

టెక్సాస్‌లోని మాస్సేలో ఉన్న స్పేస్‌ ఎక్స్ పరీక్షా కేంద్రంలో స్టార్‌షిప్ షిప్ 36 స్టాటిక్ ఫైర్ టెస్ట్‌కు ముందు పేలుడు సంభవించింది. స్పేస్ ఎక్స్ దీన్ని ధృవీకరించింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలిపింది. అయితే పేలుడు.. నమూనాను దెబ్బతీసిందని వెల్లడించింది. ఈ ఘటనతో అన్ని ప్రయోగ కార్యకలాపాలను నిరవధికంగా నిలిపివేసినట్లు ప్రకటించింది.

జూన్ 29న ప్రయోగించాలని స్పేస్‌ఎక్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ఎలోన్ మస్క్ కంపెనీ స్పేస్‌ ఎక్స్ స్టార్‌షిప్‌ను నిర్మిస్తోంది. ఇది సూపర్-పవర్‌ఫుల్ రాకెట్. ఇది మనుషులను అంగారక గ్రహానికి తీసుకెళ్లడానికి, పెద్ద అంతరిక్ష కార్యకలాపాలకు సహాయం చేయడానికి రూపొందించబడింది. విమానంలో రెండుసార్లు విఫలమైన తర్వాత, 2025లో స్టార్‌షిప్ ప్రోగ్రామ్‌కు ఇది మూడవ తీవ్రమైన ఎదురుదెబ్బ.

Also Read: ఇరాన్, ఇజ్రాయెల్ వార్.. రంగంలోకి రష్యా, చైనా.. అమెరికాకి వార్నింగ్.. మిలటరీ జోక్యం చేశారో.. ట్రంప్ కి ధమ్కీ

రాప్టర్ ఇంజిన్లలో హార్డ వేర్ వైఫల్యం వల్ల పేలుడు జరిగినట్లు స్పేస్ ఎక్స్‌ ప్రాథమిక నివేదిక తెలిపింది. రాకెట్ ప్రయోగ కేంద్రం వద్దే పేలిపోవడం, అది కూడా మొదటి దశలోనే ధ్వంసం కావడం స్పేస్ ఎక్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు అయ్యింది.

ఇటీవలి కాలంలో స్పేస్ ఎక్స్ కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. సుదూర అంతరిక్ష యాత్రల కోసం రూపొందించిన స్టార్ షిప్ మెగా రాకెట్ ఇప్పటికే మూడుసార్లు విఫలమైంది.