Isolating Until I'm Healthy Again Bill Gates Tests Covid Positive (1)
Bill Gates: అమెరికన్ రిచెస్ట్ పర్సన్ అయిన బిల్ గేట్స్.. ఓ అరుదైన విషయాన్ని లింక్డ్ఇన్ లో షేర్ చేసుకున్నారు. 48ఏళ్ల క్రితం తాను తయారుచేసుకున్న రెజ్యూమ్ ను బయటపెట్టారు. ఉద్యోగార్థుల్లో కాన్ఫిడెన్స్ పెంచేలా క్యాప్షన్ పెట్టారు ఆ పోస్టుకు.
“మీరు రీసెంట్ గ్రాడ్యుయేట్సా.. లేదా చదువు మధ్యలో ఆపేశారా.. మీ రెజ్యూమ్ కచ్చితంగా నా దాని కంటే బెటర్ గానే ఉండొచ్చని” వివరించారు.
బిల్ గేట్స్ (విలియమ్ హెన్రీ గేట్స్ III) హార్వార్డ్ కాలేజిలో మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలో తయారుచేసిన రెజ్యూమ్ అది. అందులో తాను ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చర్, డేటాబేస్ మేనేజ్మెంట్, కంప్యూటర్ గ్రాఫిక్స్ లాంటి ప్రత్యేక కోర్సులు నేర్చుకున్నట్లుగా పేర్కొన్నారు.
Read Also : బిల్ గేట్స్ ఫోల్డబుల్ ఫోన్ వాడుతున్నాడా? మైక్రోసాఫ్ట్ ఫోన్ అయితే కాదు..!
పలువురు బిల్ గేట్స్ రెజ్యూమ్ చాలా పర్ఫెక్ట్ గా ఉందంటూ తమతో పంచుకున్నందుకు చాలా థ్యాంక్స్ అని కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇప్పటికీ ఒక్క పేజిలో మాత్రమే ఉన్న రెజ్యూమె చాలా గ్రేట్ గా ఉందంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.