Pakistan Army: పాకిస్తాన్‌కు బిగ్ షాక్.. ఆర్మీ కాన్వాయ్ పై దాడి.. 10మంది సైనికులు హతం..

పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలతో పాకిస్థాన్ బెంబేలెత్తిపోతుంది. ఇదే సమయంలో ఆ దేశానికి మరో బిగ్ షాక్ తగిలింది.

Pakistan Army

Pakistan Army: పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలతో పాకిస్థాన్ బెంబేలెత్తిపోతుంది. ఇదే సమయంలో ఆ దేశానికి మరో బిగ్ షాక్ తగిలింది. పాక్ ఆర్మీ కాన్వాయ్ పై దాడి జరిగింది. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (Baloch Liberation Army) ఈ దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 10మంది పాకిస్థాన్ సైనికులు మరణించారు.

Also Read: Shehbaz Sharif: మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ కు స్పందించిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. ఏమన్నాడంటే?

గత కొంతకాలంగా పాకిస్థాన్ కు చెందిన బెలూచిస్తాన్ ప్రావిన్స్ లో తీవ్ర ఉధ్రిక్తతలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్నో దశాబ్దాలుగా స్వతంత్ర బెలూచిస్తాన్ కోసం బీఎల్ఏ పోరాడుతోంది. ఈ క్రమంలో పాక్ ప్రభుత్వం తమ హక్కులు దూరం చేస్తున్నదని ఆరోపిస్తూ ఇటీవల వరుస దాడులకు పాల్పడుతోంది. ఈ క్రమంలో పాక్ ఆర్మీ కాన్వాయ్ పై బెలూచ్ ఫ్రీడమ్ ఫైటర్స్ దాడి చేశారు. ఈ దాడిలో 10మంది పాకిస్థాన్ సైనికులు మృతిచెందారు. ఆర్మీ కాన్వాయ్ లోని ఒక వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఇందుకు సంబంధించిన వీడియోను బీఎల్ఏ స్వయంగా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో పేలుళ్లు, కాల్పుల శబ్దాలు, దగ్దమైన పాక్ ఆర్మీ వాహనాలు కనిపిస్తున్నాయి.

Also Read: Pahalgam Terror Attack: దెబ్బ అదుర్స్ కదా.. భారత్ దెబ్బకు విలవిల్లాడుతున్న పాకిస్థాన్.. ఏం జరుగుతుందో చూడండి..

ఈ దాడి గురించి పాకిస్థాన్ ప్రభుత్వం అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదిలాఉంటే.. దాడి అనంతరం పాకిస్థాన్ ఆర్మీకి బీఎల్ఏ హెచ్చరికలు జారీ చేసింది. ‘‘ఇది కేవలం ప్రారంభం మాత్రమే.. పాకిస్థాన్ ఆర్మీకి ఇకపై భద్రత ఉండదు.. మేం మా హక్కుల కోసం చివరి వరకు పోరాడతాం’’ అంటూ పేర్కొంది.