Blood moon fears of biblical end-times warning
Blood Moon: బ్లడ్ మూన్ గా పిలువబడే సంపూర్ణ చంద్రగ్రహణం మార్చి 3న (కొన్ని ప్రాంతాలలో మార్చి 2 రాత్రి ప్రారంభమవుతుంది) సంభవించనుంది. 2026 నుంచి 2028 సంవత్సరాల మధ్య కనిపించే చివరి బ్లడ్ మూన్ ఇదే అంటూ ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఈ సమయంలో చంద్రుడు భూమి యొక్క ఎరుపు రంగు నీడలో పూర్తిగా ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో భూమి యొక్క వాతావరణం ద్వారా సూర్యకాంతి నేరుగా చంద్రుడిపై పడుతుంది.
అందుకే ఈ సమయంలో చంద్రుడు పూర్తిగా ఎర్రగా మారి కనిపించనున్నాడు. ఈ బ్లడ్ మూన్ అనేది తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా(Blood Moon), ఓషియానియా, పసిఫిక్ మరియు ఉత్తర అమెరికా ప్రాంతాలలో స్పష్టంగా కనిపించనుంది. దాదాపు 58 నిమిషాల పాటు ఈ దశ ఉంటుందని, పూర్తి గ్రహణం ఐదు గంటల కంటే ఎక్కువ ఉంటుంది ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
Ktr: మీకు నేను ఉన్నాను.. ఖమ్మం ఇళ్ల కూల్చివేత భాదితులకు కేటీఆర్ భరోసా
అయితే, కొంతమంది నెటిజన్స్ మాత్రం ఇది సృష్టి ముగింపులు సూచికగా చెప్తున్నారు. మరీ ముఖ్యంగా బైబిల్ ను నమ్మేవారు ఈ విషయాన్నీ బలంగా చెప్తున్నారు. భయపడుతున్నారు కూడా. బైబిల్ లో ఈ విషయం చాలా స్పష్టంగా రాసి కోడ్ చేస్తున్నారు. ఈమేరకు ఓ నెటిజన్ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టాడు.’మార్చి 3న జరగబోయే ఈ రక్త చంద్రుడు బైబిల్‌లో ఉన్నది అని మీరు అనుకుంటున్నారా? అది జోయెల్ 2:31 నాకు చాలా ఖచ్చితంగా తెలుసు. యెహోవా యొక్క ఆ మహా భయంకరమైన దినము రాకముందు సూర్యుడు చీకటిగాను, చంద్రుడు రక్తంగాను మారతాడు.
యోవేలు 2:31 విశ్వ సంబంధమైన అల్లకల్లోలాలను, దైవిక తీర్పును సూచిస్తుంది. దుష్టులకు రాబోయే ప్రమాదం, విశ్వాసులకు రక్షణ సమయాన్ని సూచిస్తుంది. బైబిల్ లో ఈ వచనాలను క్రిస్టియన్స్ చాలా బలంగా నమ్ముతారు. ఇప్పుడు, ఆలాంటి సంఘటనే ఇప్ప్పుడు జరుగుతుండటంతో మార్చి 3న రానున్న ఈ చంద్ర గ్రహణం ఆసక్తిని పెంచుతోంది. చాలా మంది ఈ గ్రహణాన్ని దైవ సంకేతంగా సూచిస్తున్నారు. మరి నిజంగా ఇది దైవ సాకేతమేనా.. లేదా నిత్యం ఈ విశ్వంలో జరిగే ఒక అద్భుతమైన వింతేన అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా మార్చి 3న జరుగనున్న ఈ బ్లడ్ మూడ్ అనేది తీవ్ర ఆసక్తిని,. అంతకుముంచి కొత్త చర్చను లేవనెత్తింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.