Congo Boat
Congo Boat : కాంగో నదిలో పడవ ప్రమాదం జరిగింది. పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్తున్న పడవ సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 100 మందికిపైగా మృతి చెంది ఉంటారని తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు 61 మృతదేహాలను బయటకు తీసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ప్రమాదం నుంచి 39 మంది సజీవంగా బయటపడ్డారని వివరించారు. కనిపించకుండా పోయినవారికోసం గాలింపు చర్యలు ప్రారంభించారు అధికారులు.
Read More : పడవ బోల్తా..ఒకరు మృతి,పలువురు గల్లంతు
పరిమితికి మించి ఎక్కడం వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు అధికారులు. పడవ ఎక్కే ముందు ప్రయాణికులను లెక్కించలేదని గవర్నర్ ప్రతినిధి మగ్బాడో తెలిపారు. బాధితుల్లో హాకర్లు, విద్యార్థులు ఉన్నట్లు మగ్బాడో చెప్పారు. వీరంతా ప్రావిన్షియల్ రాజధాని బుంబాకు వెళ్తున్నట్లు వివరించారు. పడవ సీటింగ్ సామర్థ్యాన్ని చూసి తప్పిపోయిన వారి సంఖ్యను అంచనా వేస్తున్నారు అధికారులు.
Read More : బ్రహ్మపుత్ర నదిలో పడవల ప్రమాదంపై స్పందించిన ప్రధాని
ఇక కాంగో నదిలో పడవ ప్రమాదాలు సర్వసాధారణమైపోయాయి. తాజాగా మరో పడవ కూడా నదిలో మునకేసింది. ఈ దుర్ఘటనలో 50 మందికి పైగా మరణించారు. పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లడమే ఈ దుర్ఘటనకు కారణమని అధికారులు గుర్తించారు. ప్రయాణికులకు సరిపొయ్యేని లైఫ్ జాకెట్లు లేకపోవడం వల్లనే మరణాల సంఖ్య పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మై-ఎన్‌డొంబే ప్రావిన్స్‌లోని పడవ బోల్తాపడి 60 మంది మరణించారు. 2020 మే నెలలో జరిగిన ప్రమాదంలో 10 మంది, 2010 జూలైలో జరిగిన ఘటనలో 135 మంది దుర్మరణం పాలయ్యారు.