Boat Capsizes : పడవ బోల్తా..ఒకరు మృతి,పలువురు గల్లంతు

బీహార్‌లో ఘర ప్రమాదం సంభవించింది. ఆదివారం ఉదయం మోతిహరి జిల్లాలో సికారహనా నదిలో పడవ బోల్తా పడింది.

 Boat Capsizes : పడవ బోల్తా..ఒకరు మృతి,పలువురు గల్లంతు

Bihar (2)

Updated On : September 26, 2021 / 3:08 PM IST

Boat Capsizes బీహార్‌లో ఘర ప్రమాదం సంభవించింది. ఆదివారం ఉదయం మోతిహరి జిల్లాలో సికారహనా నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. అనేక మంది గల్లంతయ్యారు.

ప్రమాదసమయంలో బోటులో మొత్తం 21మంది ఉన్నారని..ఇందులో ఒకరు మరణించగా..నలుగురికి గాయాలయ్యాయని మోతిహరి అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్(ADM)అనీల్ కుమార్ తెలిపారు. గాయపడినవారిని హాస్పిటల్ కి తరలించామని..ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

ఇక,నదిలో గల్లంతయినవారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని తెలిపారు. పోలీసులు, స్థానిక పాలనా యంత్రాంగం, స్థానిక ప్రజలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.