Peddi Advance booking: ‘పెద్ది’ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్
పెద్ది అడ్వాన్స్ బుకింగ్స్(Peddi Advance booking) పై మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ వచ్చేసింది.
Ram Charan Peddi movie Advance booking opened
- రామ్ చరణ్ ‘పెద్ది’ బుకింగ్స్ ఓపెన్
- జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదల
- ఏపీ, తెలంగాణల్లో నేడే టికెట్ల అమ్మకాలు
Peddi Advance booking: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటకు సిద్ధమైంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టికెట్ బుకింగ్స్ అప్డేట్ అధికారికంగా వచ్చేసింది.
Irumudi Glimpse: రవితేజ ‘ఇరుముడి’ మూవీ నుంచి స్పెషల్ గ్లింప్స్ అప్డేట్
ఆంధ్రప్రదేశ్‌లో ‘పెద్ది’ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్(Peddi Advance booking) ఈరోజు మధ్యాహ్నం 2 గంటల 7 నిమిషాల నుంచే ప్రముఖ టికెటింగ్ యాప్ ‘డిస్ట్రిక్ట్’లో ప్రారంభం కానున్నాయి. అటు తెలంగాణలోనూ ఈరోజు సాయంత్రం నుంచే టికెట్ అమ్మకాలు షురూ కాబోతున్నట్లు సమాచారం. అయితే ప్రీమియర్ షోల ఖచ్చితమైన సమయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ అప్డేట్తో థియేటర్లలో ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనుకునే ఫ్యాన్స్ అప్పుడే బుకింగ్స్ కోసం అలర్ట్ అయ్యారు.
జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. జగపతి బాబు, బోమన్ ఇరానీ, దివ్యేందు శర్మ వంటి దిగ్గజ నటులు భాగమైన ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. టాప్ టెక్నీషియన్ల కలయికలో ఒక విజువల్ వండర్‌గా వస్తున్న ‘పెద్ది’ జూన్ 4న ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
