Boieng Cargo Plane : కూలిపోయిన బోయింగ్ విమానం పైలెట్లను రక్షించిన కోస్ట్‌గార్డ్స్

శుక్రవారం తెల్లవారు ఝామున హోనలూలు సమీపంలో సముద్రంలో కూలిపోయిన బోయింగ్ 737 కార్గో విమానానికి చెందిన ఇద్దరు పైలెట్‌లను యూఎస్ కోస్ట్‌గార్డ్స్ రక్షించారు.

Boeing 737 Pilots Rescued

Boieng Cargo Plane : శుక్రవారం తెల్లవారు ఝామున హోనలూలు సమీపంలో సముద్రంలో కూలిపోయిన బోయింగ్ 737 కార్గో విమానానికి చెందిన ఇద్దరు పైలెట్‌లను యూఎస్ కోస్ట్‌గార్డ్స్ రక్షించారు. డేనియల్ కే.ఇనోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలు దేరిన కొద్ది సేపటికే ఎయిర్ ట్రాపిక్ కంట్రోల్ రూం కు పైలెట్లు అందించిన సమాచారం ప్రకారం… ఒకటో నెంబర్ ఇంజన్ లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు, అప్పటికే అది అప్పటికే బాగా వేడెక్కినట్లు చెప్పారు.

వెంటనే వారు విమానాన్ని సముద్రానికి తక్కువ ఎత్తులోకి దించుతున్నట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కి సమాచారం ఇచ్చారు. విమానంలో రెండుగంటలకు సరిపడా ఇంధనం ఉందని తెలిపారు. కోస్ట్ గార్డుకు సమాచారం ఇవ్వమని పైలెట్లు కోరారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూం నుంచి యూఎస్  కోస్ట్‌గార్డ్‌కు సమాచారం ఇచ్చారు.

అప్రమత్తమైన కోస్ట్ గార్డు సిబ్బంది… పైలెట్లను వెతకటానికి అర్ధరాత్రి గం.1-30 సమయంలో ఒక హెలి కాప్టర్ ను, రెస్క్యూ టీం ను,  45 అడుగుల పడవను పంపించారు. పైలట్లు విమానాన్ని  సముద్రంలోకి   దించగానే వారిని కోస్ట్ గార్డ్ సిబ్బంది రక్షించారు. ఇద్దరి ఆరోగ్య పరిస్ధితి నిలకడగానే ఉందని యూఎస్ పీజీ ప్రతినిధి లెఫ్టినెంట్ కమాండర్ కరిన్ ఎవెలిన్ ఒక ప్రకటనలో తెలిపారు. వారిద్దరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తెలిపారు.

విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ విభాగం తెలిపింది. హోనలూలు నుంచి మౌయీ ద్వీపంలోని కహులూయి విమానాశ్రయానికి కార్గో విమానం బయలు దేరింది. విమాన శిధిలాలు సముద్రంలో ల్యాండింగ్ అయిన ప్రదేశంలోనే ఉన్నాయని యూఎస్‌సిజి అధికారులు చెప్పారు.

బోయింగ్ 737-200 కార్గో విమానాన్ని 1975 లో తయారు చేశారు. దాని పరిమాణం కేవలం 100 అఢుగులు మాత్రమే. విమానాన్ని అవసరం అయితే 100 మంది ప్రయాణించేందుకు వీలుగా కూడా మార్చుకునేలా దీన్ని తయారు చేశారు. ఇది 737 మ్యాక్స్ తరహా విమానం కాదని, ఇది 2018, 2019లో జరిగిన రెండు ఘోర ప్రమాదాల తర్వాత దీన్ని నిషేదించారని బోయింగ్ జెట్ అధికారులు తెలిపారు.