×
Ad

Bolivia Plane Crash : కరెన్సీ నోట్లు తరలిస్తుండగా కుప్పకూలిన విమానం.. వీడియో వైరల్.. 15మంది మృతి.. చెల్లాచెదురుగా పడిపోయిన నోట్లు..

Bolivia Plane Crash : బొలీవియా ఎయిర్‌ఫోర్స్ విమానం శాంటాక్రూజ్ నుంచి బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపంతో కుప్పకూలిపోయింది.

Bolivia Plane Crash

  • బొలీవియాలో ఘోర విమాన ప్రమాదం
  • కూలిపోయిన వైమానిక దళానికి చెందిన విమానం
  • 15మంది మృతి.. 30మందికి గాయాలు
  • కొత్త కరెన్సీ నోట్లు తరలిస్తుండగా ప్రమాదం

Bolivia Plane Crash : బొలీవియా రాజధాని లా పాజ్ సమీపంలో ఎల్ ఆల్టో నగరంలో శుక్రవారం తీవ్ర విషాదం నెలకొంది. బొలీవియన్ వైమానిక దళానికి చెందిన విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 15మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 30మందికి గాయాలయ్యాయి. అయితే, ప్రాణాలు కోల్పోయిన వారిలో రోడ్డుపై వఎళ్తున్న పౌరులు కూడా ఉన్నారని స్థానిక అధికారులు ధ్రువీకరించారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Also Read : T20 World Cup 2026 : ఊపిరిపీల్చుకున్న పాక్.. సెమీస్‌కు వెళ్లేందుకు అద్భుత అవకాశం.. కానీ, అసలు సమస్య అదే..

బొలీవియా ఎయిర్‌ఫోర్స్ విమానం శాంటాక్రూజ్ నుంచి బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపంతో కుప్పకూలిపోయింది. అందులో సెంట్రల్ బ్యాంక్ నుంచి కొత్తగా ముద్రించిన కరెన్సీని ఇతర నగరాలకు తరలిస్తుందని దేశ రక్షణ మంత్రిత్వశాఖ అధికారులను ఉటంకిస్తూ అక్కడి మీడియా పేర్కొంది.

ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు, రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. విమానం జనసంచారం ఉన్న ప్రాంతంలో కూలిపోవడంతో మృతుల్లో, గాయపడిన వారిలో స్థానికులు ఉన్నారు. గాయపడిన వారిలో పలువురికి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు.

విమాన ప్రమాదంతో ఎల్ ఆల్టో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. విమానంలోని కరెన్సీ నేలపై చెల్లాచెదురుగా పడిపోయిన దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, కొత్తగా ముద్రించిన కరెన్సీ నోట్లను తీసుకునేందుకు అక్కడి ప్రజలు పోటీపడ్డారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకుని ఘటన స్థలి నుంచి పంపించివేశారు. ఇదిలాఉంటే.. ప్రమాదంకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.