Larissa Borges
Larissa Borges : బ్రెజిలియన్ ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా సంచలనం లారిస్సా బోర్గెస్ డబుల్ కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోయినట్లు తెలుస్తోంది. 33 ఏళ్ల వయసులో ఆమె చనిపోవడం ఆమె అభిమానుల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
Cheems: కూల్ స్టైల్ వైరల్ మీమ్ డాగ్ చీమ్స్ ఇక లేదు.. శస్త్రచికిత్స చేస్తుండగా ఆపరేషన్ టేబుల్‌పై మరణం
బ్రెజిలియన్ ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ లారిస్సా బోర్గెస్ డబుల్ కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోయారు. ఆమె వయసు కేవలం 33 సంవత్సరాలు. ఈ విషాద వార్తను ఆమె కుటుంబ సభ్యులు తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా తెలియజేశారు. ఆమె మరణం తమ కుటుంబానికి తీరని లోటని వారు పోస్టు చేశారు.
ఆగస్టు 20 న గ్రామాడోకి ప్రయాణిస్తున్న లారిస్సా బోర్గెస్‌కు గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేరారు. కోమాలోకి వెళ్లడంతో కుటుంబసభ్యులు ఆమె ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో అప్ డేట్లు అందించారు. అంతలోనే బోర్గెస్‌కు రెండవసారి గుండెపోటు రావడంతో చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఆమె మరణానికి కారణం అస్పష్టంగా ఉంది. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె మత్తు పదార్ధాలు సేవించి ఉండవచ్చని ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఆమె మృతదేహానికి పోలీసులు పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆర్ధిక సమస్యలు ఎదుర్కుంటున్న బోర్గెస్ కుటుంబం గ్రామాడో నుంచి బోర్గెస్ మృతదేహాన్ని ఆమె స్వగ్రామానికి తరలించడానికి ప్రజల నుండి విరాళాలు కోరింది.
Shivani Dar : అకస్మాత్తుగా మరణించిన ప్రముఖ యాంకర్
పోస్టుమార్టం నివేదిక వస్తేనే బోర్గెస్ మరణానికి ఖచ్చితమైన కారణం తెలుస్తుంది. అయితే ఆమె చివరిసారి ఇండోర్ స్కీ పార్క్‌లో వింటర్ కోట్‌తో తీసుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ‘నేను రేటిని నమ్మగలను’ క్యాప్షన్‌తో ఆమె ఆ ఫోటోలు షేర్ చేసుకుంది. ఎంతో భవిష్యత్ ఉన్న బోర్గెస్ చిన్న వయసులో చనిపోవడంపై నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు.