Cheems: కూల్ స్టైల్ వైరల్ మీమ్ డాగ్ చీమ్స్ ఇక లేదు.. శస్త్రచికిత్స చేస్తుండగా ఆపరేషన్ టేబుల్‌పై మరణం

ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, వైరల్ డాగ్ చీమ్స్ కీమోథెరపీ గురించి చీమ్స్ యజమాని ప్రతిరోజు అప్డేట్స్ ఇచ్చారు. గతంలో కూడా ఒకసారి చీమ్స్ ఆరోగ్యం క్షీణించింది. తాజాగా అదే సమస్య రావడంతో థొరాసెంటెసిస్ శస్త్రచికిత్స జరుగుతోంది

Cheems: కూల్ స్టైల్ వైరల్ మీమ్ డాగ్ చీమ్స్ ఇక లేదు.. శస్త్రచికిత్స చేస్తుండగా ఆపరేషన్ టేబుల్‌పై మరణం

Updated On : August 20, 2023 / 8:16 PM IST

Meme Dog Cheems: సోషల్ మీడియాను ఉపయోగించే వారికి చీమ్స్ డాగ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన కూల్ స్టైల్‌తో చాలా సంవత్సరాలుగా సోషల్ మీడియాలో వైరల్ మీమ్స్ కు కేరాఫ్ అడ్రస్ అయింది. సందర్భం ఏదైనా కాస్త సెటైరికల్ గా, కాస్త హస్యంగా చెప్పాలంటే చీమ్స్ డాగ్ ని రంగంలోకి దింపాల్సిందే. నిజానికి చీమ్స్ కు సంబంధం లేకుండా ఎన్ని పాత్రల్లో ఇమిడిపోయిందో లెక్క కట్టలేం. ఆ చీమ్స్ ప్రపంచానికి వీడ్కోలు పలికింది. తాజా సమాచారం ప్రకారం, శుక్రవారం థొరాసెంటెసిస్ సర్జరీ కొనసాగుతుండగానే ఆకస్మికంగా మరణించినట్లు సమాచారం.

Russia Luna25: అప్పుడు చంద్రయాన్-2.. ఇప్పుడు రష్యా లూనా-25.. అచ్చం ఇలాగే జరిగింది..

చీమ్స్ వయసు 12 ఏళ్లు. కొన్ని సంవత్సరాల క్రితం, షిబా ఇను జాతికి చెందిన ఈ కుక్క సోషల్ మీడియాలో ఒక సంచలనంగా అవతరించింది. అనతికాలంలోనే మీమ్ ఐకాన్‌గా మారిపోయింది. వాస్తవానికి చీమ్స్ కు బర్గర్‌లు అంటే చాలా ఇస్టమని, అందుకే సోషల్ మీడియాలో చిమ్స్ అని పేరు పెట్టారు. మీమ్‌ల వరద రావడంతో చీమ్స్ ప్రపంచ సెలెబ్రెటీ అయిపోయింది. టెస్లా యజమాని ఎలోన్ మస్క్ వంటి పెద్ద వ్యాపారవేత్తలు కూడా చైమ్స్‌ మీమ్స్ ను చాలా ఇష్టపడ్డారు. బాగా ప్రాచుర్యం పొందిన చీమ్స్‌కు సంబంధించిన ఉత్పత్తులకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది.

సమాచారం అందిన వెంటనే సోషల్ మీడియాలో ప్రజలు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా కోట్లాది మందిని అలరించిన చీమ్స్ నిష్క్రమణ నిజంగా చాలా బాధాకరమని అంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, వైరల్ డాగ్ చీమ్స్ కీమోథెరపీ గురించి చీమ్స్ యజమాని ప్రతిరోజు అప్డేట్స్ ఇచ్చారు. గతంలో కూడా ఒకసారి చీమ్స్ ఆరోగ్యం క్షీణించింది. తాజాగా అదే సమస్య రావడంతో థొరాసెంటెసిస్ శస్త్రచికిత్స జరుగుతోంది. కానీ చికిత్స జరుగుతుండగానే ఆపరేషన్ టేబుల్‌ మీదే చీమ్స్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

చైమ్స్ అభిమానులు సోషల్ మీడియాలో సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు, అయితే చైమ్స్ గురించి యజమాని గర్వంగా స్పందించారు. ‘‘కరోనా మహమ్మారి సమయంలో చాలా మందికి చీమ్స్ సహాయం చేసింది. చాలా మంది ముఖాల్లో చిరునవ్వు తెప్పించింది. తన లక్ష్యం నెరవేరి ప్రపంచానికి వీడ్కోలు పలికిందన్నది నిజం’’ అని సోషల్ మీడియా ద్వారా స్పందించారు. హాంగ్‌కాంగ్‌లో కాథీ అనే మహిళ చైమ్స్‌ని దత్తత తీసుకుని పెంచారు. కేథీ ఈ కుక్కను కేవలం 1 సంవత్సరాల వయస్సులో దత్తత తీసుకుని దానికి చీమ్స్ అని పేరు పెట్టారు. నిజానికి చీమ్స్ అసలు పేరు పప్ బాల్ట్జ్. 2010 లో ప్రజాదరణ పెరిగింది. ఇక చీమ్స్ కు ప్రజాధరణ పెరిగిన తర్వాత 2015లో చీమ్స్ ఖాతాను తెరిచారు.