Russia Luna25: అప్పుడు చంద్రయాన్-2.. ఇప్పుడు రష్యా లూనా-25.. అచ్చం ఇలాగే జరిగింది..

సాఫ్ట్ ల్యాండింగ్ కోసం అప్పట్లో ల్యాండర్లో థ్రస్టర్ ఇంజన్లు మండించారు. అనంతరం అది ప్రయాణిస్తున్న దిశకు వ్యతిరేక దిశలో రాకెట్..

Russia Luna25: అప్పుడు చంద్రయాన్-2.. ఇప్పుడు రష్యా లూనా-25.. అచ్చం ఇలాగే జరిగింది..

Chandrayaan-2

Updated On : August 20, 2023 / 5:29 PM IST

Russia Luna25 probe: క్రాష్ ల్యాండింగ్.. ఈ పదమే అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది. 2019లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రయోగించిన చంద్రయాన్-2 క్యాష్ ల్యాండింగ్ వల్ల విఫలమైన విషయం తెలిసిందే. ఇవాళ రష్యా లూనా-25 కూడా విఫలమైంది.

చంద్రుడి దక్షిణ ధ్రువంలోని రహస్యాలను ఛేదించడానికి అంతరిక్ష శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాలు వరుసగా విఫలం అవుతున్నాయి. ప్రస్తుతం చంద్రయాన్-3పై అందరి ఆశలు ఉన్నాయి. చంద్రుడిపైకి చంద్రయాన్-1ను భారత్ మొదటిసారి 2008 ఏడాదిలో ప్రయోగించింది. అప్పట్లో సేకరించిన సమాచారం ద్వారా చంద్రుడి మీద నీరు ఉన్నట్లు ఇస్రో ప్రకటించింది. మళ్లీ 2019లో చంద్రయాన్-3 ప్రయోగాన్ని భారత్ చేపట్టింది. ఇందులో ఆర్బిటర్ తో పాటు ల్యాండర్, రోవర్‌ ఉన్నాయి.

అప్పట్లో చంద్రుడిపై చంద్రయాన్-2 క్రాష్ ల్యాండింగ్ అయింది. రష్యా లూనా-25 ఇవాళ విఫలం కావడంతో, ఇస్రో చంద్రయాన్-2 ప్రయోగాన్ని అది గుర్తుకు తెస్తోంది. 2019లో చంద్రయాన్-2లోని చంద్రయాన్-2 ల్యాండర్, రోవర్ సాఫ్ట్ ల్యాండింగ్ కాలేదు. ల్యాండర్, రోవర్‌ చంద్రుడిపై ల్యాండింగ్ అయ్యే చివరి నిమిషంలో దాని నుంచి సంకేతాలు నిలిచిపోయాయని అప్పట్లో ఇస్రో ప్రకటించింది.

భారత్, రష్యా ఎందుకు విఫలమయ్యాయి?

సాఫ్ట్ ల్యాండింగ్ కోసం అప్పట్లో ఇస్రో శాస్త్రవేత్తలు ల్యాండర్లో థ్రస్టర్ ఇంజన్లు మండించారు. అనంతరం అది ప్రయాణిస్తున్న దిశకు వ్యతిరేక దిశలో రాకెట్ వేగాన్ని తగ్గించారు. చంద్రుడి ఉపరితలానికి ల్యాండర్ 500 మీటర్ల దూరంలో ఉన్న సమయంలో క్రాష్ కావడంతో దేశం మొత్తం నిరాశ చెందింది. ఇప్పుడూ లూనా-25 విషయంలో ఇటువంటి పరిస్థితుల వల్లే ఇదీ విఫలమైంది.

ఇప్పుడూ రష్యా కూడా అదే కారణాన్ని చెప్పింది. జాబిలి దక్షిణ ధ్రువాన్ని చేరుకునేందుకు రష్యా ప్రయోగించిన లూనా-25 ల్యాండర్‌.. చంద్రుడికి కాస్త దూరంలోనే కుప్పకూలిపోయిందని రష్యా దేశ స్పేస్ ఏజెన్సీ రోస్కోస్మోస్ తెలిపింది. లూనా-25తో సంబంధాలు ఆదివారం మధ్యాహ్నం 2.57 గంటలకు పూర్తిగా తెగిపోయాయని తెలిపింది. తమకు దాని నుంచి ఎలాంటి సమాచారం అందడం లేదని వివరించింది.

లూనా-25కు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు శనివారం నుంచి ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని స్పష్టం చేసింది. సరిగ్గా ఎలాంటి సాంకేతిక కారణాల వల్ల సంబంధాలు తెగిపోయాయన్న విషయాలను గుర్తిస్తామని పేర్కొంది.

భారత్ ఇప్పటికే చంద్రయాన్-2కు వైఫల్యానికి సంబంధించిన కారణాలను గుర్తించి చంద్రయాన్-3లో ఆ లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకుంది. ఈ ఆశతోనే చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుందని ఇస్రో విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఈ ప్రయోగం విజయవంతమైతే దక్షిణ ధ్రువంతో ఏముందో తెలిసే అవకాశం ఉంది.

Russia Luna25: జాబిలిని అందుకోలేకపోయిన రష్యా.. కుప్పకూలిన లూనా-25.. ఇక చంద్రయాన్-3?