Shivani Dar : అకస్మాత్తుగా మరణించిన ప్రముఖ యాంకర్

తాజాగా ప్రముఖ యాంకర్ అకస్మాత్తుగా మరణించింది. మనదేశంలో అనేక కార్పొరేట్, అధికారిక కార్యక్రమాలకు హోస్ట్ గా, పలు ఈవెంట్స్ లో కూడా యాంకర్ గా చేసింది శివాని సేన్.

Shivani Dar : అకస్మాత్తుగా మరణించిన ప్రముఖ యాంకర్

Anchor Shivani Dar Suddenly Passes Away

Updated On : July 11, 2023 / 7:27 AM IST

Shivani Sen :  ఇటీవల పలువురు సెలబ్రిటీలు మరణిస్తూ విషాదం మిగులుస్తున్నారు. తాజాగా ప్రముఖ యాంకర్ అకస్మాత్తుగా మరణించింది. మనదేశంలో అనేక కార్పొరేట్, అధికారిక కార్యక్రమాలకు హోస్ట్ గా, పలు ఈవెంట్స్ లో కూడా యాంకర్ గా చేసింది శివాని సేన్. ఇటీవలే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు కూడా అధికారిక కార్యక్రమాల్లో యాంకర్ గా చేసింది శివాని సేన్. ఆదివారం వరకు కూడా బాగానే ఉన్న ఆమె సోమవారం ఉదయం అకస్మాత్తుగా మరణించడంతో అందరూ షాక్ అవుతున్నారు.

శివాని సేన్ గత కొన్ని రోజులుగా ఎపిలెప్టిక్ అటాక్ అనే బ్రెయిన్ సంబంధిత సమస్యతో బాధపడుతుంది. సోమవారం నాడు తన ఇంట్లోనే చలనం లేకుండా పడిపోయి ఉండటంతో పనిమనిషి అపార్ట్మెంట్ వాళ్లకు ఇన్ఫర్మ్ చేయగా హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు తెలిపారు. ఎపిలెప్టిక్ అటాక్ తోనే ఆమె మరణించిందని వైద్యులు తెలిపారు.

Suchitra Krishnamoorthi : ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. అయినా నా భర్తే నన్ను మోసం చేశాడు..

దీంతో పలువురు ప్రముఖులు శివానికి నివాళులు అర్పిస్తున్నారు. దేశంలో అనేక అధికారిక ఈవెంట్స్ కి ఈమె యాంకరింగ్ చేసేది. 2009 మిస్ట్రెస్ సౌత్ ఇండియా ఫస్ట్ రన్నరప్ గా కూడా నిలిచింది.