మహిళలకు స్వేచ్ఛ :హోటల్ రూమ్స్ విషయంలో సౌదీ కీలక నిర్ణయం

సౌదీలో సంస్కరణల క్రమం కొనసాగుతోంది. ఒక్కొక్కటిగా ఆంక్షలు సడలిస్తున్నారు. కొంతకాలంగా పాత రూల్స్ ని బ్రేక్ చేస్తూ…మహిళల విషయంలో అదేవిధంగా విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు సౌదీ అనేక సంస్కరణలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు విదేశీ పర్యాకులకు ఆకర్షించేందుకు సౌదీ అరేబియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త టూరిస్ట్ వీసా వ్యవస్థను లాంఛ్ చేసిన సౌదీ… ఇకపై విదేశీ పురుషులు, మహిళలు తమ రిలేషన్ షిప్ కి సంబంధించిన ఫ్రూఫ్ చూపించకుండానే కలిసి హోటల్ గదులను అద్దెకు ఇవ్వడానికి అనుమతిస్తోంది. ఈ నిర్ణయం తోడు లేని మహిళలు మరింత సులభంగా ప్రయాణించడానికి కూడా మార్గం సుగమం చేస్తుంది.

ఇకపై సౌదీ మహిళలు కూడా స్వయంగా హోటల్ రూమ్స్ తీసుకోవచ్చు.పెళ్లికి ముందు సెక్స్ నిషేధం ఉన్న సౌదీలో…తోడు లేని మహిళలు మరింత సులభంగా ప్రయాణించడానికి, పెళ్లికాని విదేశీ సందర్శకులు కలిసి ఉండటానికి సౌదీ ఈ నిర్ణయం తీసుకుంది. సౌదీలతో సహా మహిళలందరూ  హోటళ్లలోకి వెళ్లేటప్పుడు ఫ్యామిలీ ఐడీ లేదా,రిలేషిన్ షిప్ కి సంబంధించిన రుజువు చూపించకుండానే ఒంటరిగానే  హోటల్ రూమ్ బుక్ చేసుకొని ఉండవచ్చని సౌదీ కమిషన్ ఫర్ టూరిజం అండ్ నేషనల్ హెరిటేజ్ తెలిపింది.

చమురు ఎగుమతులకు దూరంగా తన ఆర్థిక వ్యవస్థను విస్తృతం చేయడానికి సౌదీ అరేబియా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే టూరిస్టుల వస్త్రధారణ విషయంలో నిబంధనలను సడలించింది. ఒంటినిండా దుస్తులు ఉండాలన్న రూల్ ని పక్కనబెట్టి…తమకు నచ్చిన దుస్తులను టూరిస్టులు వేసుకోవచ్చని తెలిపింది. అయితే ఆ దుస్తులు సంప్రదాయబద్దంగా ఉండాలని తెలిపింది. అయితే మద్యంపై మాత్రం నిషేధం కొనసాగుతుందని తెలిపింది.