Bride Seeks Books Worth ‘Haq Mehr’ కట్నానికి బదులుగా రూ.లక్ష విలువైన పుస్తకాలు అడిగిన పాకిస్థాన్ వధువు

Bride Seeks Books Worth Rs 1 Lakh As ‘Haq Mehr’ : ముస్లిం వివాహాల్లో ‘మెహర్’ అంటే మన భాషలో అది కట్నం అనుకోవచ్చు. మనం సాధారణంగా వధువు వరుడికి ఇచ్చేదాన్ని కట్నం అంటాం. అదే వరుడు వధువుకు ఇచ్చేదాన్ని కన్యాశుల్కం అంటాం. దీన్నే ఎదురు కట్నం అంటాం. అదే ముస్లిం వివాహాల్లో వధువుకు వరుడు తరపువారు ‘మెహర్’ఇస్తారు. ఇదిలా ఉంటే పాకిస్థాన్ లో ఓ వధువు తనకు ఇచ్చే కట్నాన్ని (మెహర్)ను డబ్బు రూపంలో కాకుండా ఆ డబ్బుకు విలువైన పుస్తకాలు ఇవ్వాలని వరుడిని కోరింది. దానికి వరుడు అంగీకరించటంతో సదరు వధువుకు రూ.1,00,000 విలువైన పుస్తకాలను మెహర్ గా ఇచ్చారు.

పాకిస్థాన్ లోని వృత్తిపరంగా రచయిత్రి అయిన నైలా షమల్ తనకు కట్నంగా ఇచ్చే రూ.1లక్ష నగదుకు బదులుగా అంత విలువైన పుస్తకాలు ఇవ్వాలని కోరింది. దానికి వరుడు కూడా అంగీకరించాడు. సాధారణంగా ముస్లిం కుటుంబాల్లో మహిళల మాటకు పెద్దగా విలువ ఉండదు. ముఖ్యంగా వివాహం చేసుకునే వ్యక్తి గురించి నిర్ణయం తీసుకునే అవకాశం అస్సలు ఉండదు. ఇక పెళ్లి విషయంలో వధువు అభిప్రాయాలకు అస్సలు విలువ ఉండదు. కానీ ఇప్పుడిప్పుడే ముస్లిం కుటుంబాల్లో అమ్మాయిలు తమ అభిప్రాయాలను ధైర్యం చెప్పగలుగుతున్నారు. తమ ఇష్టాలను అయిష్టాలను కూడా చెబుతున్నారు. దాంట్లో భాగమే ఈ పాకిస్థానీ వధువు తనకు ఇచ్చే కట్నంగా పుస్తకాలు ఇవ్వాలని కోరటం చాలా ఆహ్వానించదగిన విషయం.

దీని గురించి వధువు నైలా షమల్ మాట్లాడుతూ..తాను పుస్తకాలు కోరటం ఒక కారణం ఉంది. మన దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా..మనం ఖరీదైన బహుమతులు ఇవ్వలేము. అదొక కారణమైతే..మన సమాజంలో వేళ్లూనుకు పోయిన ఇటువంటి ఆచారాలను తొలగించాలనే ఆలోచన ఒకటి అందుకే పుస్తకాలు కోరానని తెలిపారు నైలా షమల్. సంప్రదాయాలు..ఆచారాల పేరుతో జరిగే కొన్నింటిని వదిలించుకోవాలని మారుతున్న సమాజంతో పాటు ఇబ్బంది కలిగించే సంప్రదాలను తొలగించాలనే పుస్తకాలను కోరానని తెలిపారు. చాలా మంది మహిళలు హక్ మెహర్ కు ఇచ్చే నగదుకు బదులు ఆభరణాలను కోరుతున్నారని కానీ నేను రచయిత్రిని పుస్తకాల విలువేంటో నాకు తెలుసు అందుకే పుస్తకాలు కోరానని తెలిపింది. ఆమెకు తీసుకున్న ప్రగతిశీల ఆలోచనలను పలువురు ప్రశంసిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు